Mahadev App Scam శ్రద్దాకపూర్ మెడకు బిగుస్తున్న ఉచ్చు..జ్యూస్, టైర్ల షాప్ నుంచి మహదేవ్ 5000 కోట్ల కుంభకోణం?

మహదేవ్ యాప్‌ కోట్లాది రూపాయల కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) విచారణ, దర్యాప్తుతో లాగుతున్న తీగతో డొంక భారీగా కదులుతున్నది. ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మహదేవ్ బెట్టింగ్ యాప్‌కు చెందిన సౌరభ్ చంద్రశేఖర్ ఫ్యామిలీ దాదాపు 5000 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు ఈడీ అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ యాప్‌కు బాలీవుడ్ ప్రముఖులకు లింక్ వివరాల్లోకి వెళితే..

మహాదేవ్ యాప్ అధినేత చంద్రశేఖర్ కుటుంబం పేదరికంతో జీవించింది. చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన వారు జ్యూస్ షాప్, టైర్ల షాప్ నడిపించుకొంటూ జీవనం కొనసాగించారు. అలాంటి కుటుంబ నేపథ్యంగా ఉన్న బెట్టింగ్ యాప్ బిజినెస్‌తో కోట్లకు పడగలెత్తారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన పెళ్లికి దాదాపు 260 కోట్ల రూపాయాలు ఖర్చు చేశారు. అయితే ఈ వివాహానికి హాజరైన బాలీవుడ్ ప్రముఖులందరికీ భారీ ఎత్తున్న డబ్బు వారి అకౌంట్‌లోకి వెళ్లాయనే ఆరోపణలు వచ్చాయి.

 Mahadev Betting App Scam

మహాదేవ్ బెట్టింగ్ యాప్ పెళ్లి వ్యవహారం బయటకు రావడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ మెరుపుదాడుల్లో దాదాపు 420 కోట్లకుపైగా రూపాయలను స్వాధీనం చేసుకొన్నారు. పెళ్లికి ఖర్చు చేసిన వివరాలపై కూపీ లాగితే.. దాదాపు 100 మందికి పైగా సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరయ్యారని తేలింది. పెళ్లికి హాజరైన ప్రతీ సెలబ్రిటీకి ఒక్కరికి 40 కోట్ల రూపాయలు ముట్టజెప్పారని తెలిసింది. ఈ కేసులో కొందరిని అరెస్ట్ చేసి విచారించడంతో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి.

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో గుర్తించిన 100 మంది సెలబ్రిటీలలో బాలీవుడ్ సినీ తారలు, హిందీ సీరియల్ యాక్టర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెసర్లు ఉన్నారు. వీరికి మనీలాండరింగ్ ద్వారా డబ్బు చెల్లించారనే అభియోగాలను ఈడీ నమోదు చేసింది. ఈ క్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు.

 Will Shraddha Kapoor get Clean Chit

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఇప్పటి వరకు బాలీవుడ్ ఏ లిస్టర్స్ రణ్‌బీర్ కపూర్, శ్రద్దాకపూర్, కపిల్ శర్మ, హ్యుమా ఖురేషి, హీనా ఖాన్, కపిల్ శర్మ తదితరులకు సమన్లు జారీ చేశారు. ఈ బాలీవుడ్ సెలబ్రిటీను చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న ఈడీ ఆఫీస్‌లో జరిగే విచారణకు హాజరు కావాలని సూచించారు. అయితే ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని రణ్‌బీర్, కపిల్ శర్మ తదితరులు రిక్వెస్ట్ చేశారు.

మహదేవ్ బెట్టింగ్ యాప్ అధినేత సౌరభ్ చంద్రశేఖర్ ఇంట్లో జరిగిన పెళ్లికి బాలీవుడ్ అగ్రతారలు సునీల్ శెట్టి, సంజయ్ దత్, సోను సూద్, సోనాక్షి సిన్హా, రష్మిక మందన్న, సారా ఆలీఖాన్, టైగర్ ష్రాఫ్, కపిల్ శర్మ, మలైకా అరోరా, మౌనీ రాయ్, ఊర్వశీ రౌటేలా, స్నేహా ఉల్లాల్, నర్గీస్ ఫక్రీ, అఫ్తాబ్ శివదాసాని, ప్రీతి జింగ్యానీ‌తోపాటు మొత్తం 100 మందికి ఈ కుంభకోణంలో ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X