అత్త చేయి వదలని దీపిక.... అందరూ ఎదురు చూస్తున్న ఫోటో వచ్చేసింది!
దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ ఇటలీలో పెళ్లి వేడుక ముగించుకుని ఇండియా తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు దీప్-వీర్ లేటుగా విడుదల చేయడంపై అభిమానులు కాస్త అసంతృప్తిగానే ఉన్నారని చెప్పక తప్పదు.
Recommended Video

అభిమానులకు దీపిక పదుకోన్, రణవీర్ కుటుంబ సభ్యుల గురించి పెద్దగా తెలియదు. ఈ పెళ్లి వేడుక సందర్భంగా అయినా వారి ఫోటోస్ చూసే అవకాశం దక్కుతుందని భావించిన చాలా మందికి నిరాశే మిగిలింది. వీరి వివాహానికి సంబంధించి రెండు మూడు ఫోటోస్ తప్ప మిగతావి విడుదల చేయలేదు.

అందరూ ఎదురు చూస్తున్న ఫోటో వచ్చేసింది
రణవీర్ ఫ్యామిలీతో దీపిక పదుకోన్ ఉన్న ఫోటోస్ కోసం అభిమానులంతా రెండు మూడు రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ ఫోటో విడుదలైంది. ఇందులో రణవీర్ సింగ్ తండ్రి జగ్‌జీత్ సింగ్ భావ్‌నాని, తల్లి అంజు భావ్‌నాని, సోదరి రితికా భావ్‌నాని ఉన్నారు. దీపిక తన అత్త అంజు చేయి పట్టుకుని ఉండటం ఈ ఫోటోలో గమనించవచ్చు.

స్నేహితులతో దీప్-వీర్
లేక్ కోమోలో..... నవంబర్ 14న కొంకణి స్టైల్ వెడ్డింగ్ అనంతరం దీపిక తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటో. దీపిక పదుకోన్ టీమ్ ఈ ఫోటోను ఇపుడు విడుదల చేసింది.

రణవీర్ సింగ్ టీమ్
పెళ్లి వేడుక అనంతరం... రణవీర్ సింగ్ తన భార్య దీపిక, టీమ్‌తో కలిసి ఇలా. ఇందులో దీపిక పక్కనే రణవీర్ తల్లి అంజు కూడా ఉన్నారు. దాదాపు వారం రోజుల పాటు ఇటలీలో గడిపిన రణవీర్-దీపిక
ఆదివారం తెల్లవారు ఝామున ముంబై చేరుకున్నారు. ప్రస్తుతం రణవీర్ నివాసంలో వీరు ఉన్నారు.

వెడ్డింగ్ రిసెప్షన్స్
దీపిక, రణవీర్ దంపతుల వెడ్డింగ్ రిసెప్షన్స్ బెంగుళూరు, ముంబైలో జరుగబోతున్నాయి. దీపిక కుటుంబ సభ్యులు ఈ నెల 21న బెంగుళూరులోని ‘ది లీలా' ప్లేసులో వెడ్డింగ్ బాష్ ప్లాన్ చేయగా.... నవంబర్ 28న ముంబైలో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించబోతున్నారు.


Click it and Unblock the Notifications











