దీపిక పదుకొనేకు చేదు అనుభవం: పబ్లిక్ ప్లేస్‌లో నలిపేసిన ఫ్యాన్.. అది పట్టుకుని లాగడంతో కేకలు!

దీపిక పదుకొనే.. ఇండియాలోని సినీ లవర్స్‌కు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ సుందరాంగి చలన చిత్ర పరిశ్రమపై తన ప్రభావాన్ని చూపిస్తోంది. బాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే కుమార్తెగా సినిమాల్లోకి ప్రవేశించిన ఈమె.. దాదాపు అందరు బడా హీరోలతోనూ నటించి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అదే సమయంలో హాలీవుడ్‌లోకి సైతం ప్రవేశించింది. దీంతో యూనివర్శల్ స్టార్‌గా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీపిక పదుకొనేకు ముంబై నగరంలో చేదు అనుభవం ఎదురైంది. ఆ వివరాలు మీకోసం!

దక్షిణాది నుంచి పరిచయం.. అలా ఫేమస్

దక్షిణాది నుంచి పరిచయం.. అలా ఫేమస్

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి నటిగా ఎదిగిపోయింది హాట్ బ్యూటీ దీపిక పదుకొనే. 'ఐశ్వర్య' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ.. ఆ తర్వాత షారూఖ్ నటించిన 'ఓం శాంతి ఓం'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

ధోనీ, యువరాజ్‌తో లవ్‌తో హాట్ టాపిక్‌గా

ధోనీ, యువరాజ్‌తో లవ్‌తో హాట్ టాపిక్‌గా

దీపిక సినిమా హీరోయిన్‌గా ఎంత గుర్తింపును తెచ్చుకుందో.. ప్రేమ వ్యవహారాలతో అంతకు మించిన పాపులారిటీని సొంతం చేసుకుంది. కెరీర్ ఆరంభంలో టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీతో ఓ యాడ్ చేసింది. అప్పుడు అతడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత మరో క్రికెటర్ యువరాజ్ సింగ్‌తోనూ ప్రేమాయణం సాగించింది. వీళ్లిద్దరి తర్వాత విజయ్ మాల్యా కుమారుడితోనూ ట్రాక్ నడిపింది.

రణ్‌బీర్‌తో డేటింగ్ చేసి రణ్‌వీర్‌తో వివాహం

రణ్‌బీర్‌తో డేటింగ్ చేసి రణ్‌వీర్‌తో వివాహం

లవ్ ట్రాకుల కారణంగా దీపిక పదుకొనే తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నింటకీ దూరంగా ఉంటూ సినిమాలపై ఫోకస్ చేసింది. సరిగ్గా అప్పుడే చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో డేటింగ్ చేసింది. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా అతడికి బ్రేకప్ చెప్పి రణ్‌వీర్ సింగ్‌ను వివాహం చేసుకుని షాకిచ్చిందీ బ్యూటీ.

భర్తతో కలిసి నటిస్తూ.. ఆ బయోపిక్‌లోనూ

భర్తతో కలిసి నటిస్తూ.. ఆ బయోపిక్‌లోనూ

వివాహం తర్వాత మరింత స్పీడు పెంచిన దీపిక పదుకొనే.. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. మరీ ముఖ్యంగా భారీ చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలో భర్తతో కలిసి కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటిస్తోంది. దీంతో రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ మూవీ '83'లో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటిస్తోంది.

దీపికకు పబ్లిక్ ప్లేస్‌లో ఊహించని అనుభవం

దీపికకు పబ్లిక్ ప్లేస్‌లో ఊహించని అనుభవం

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. దీపిక పదుకొనే తరచూ ముంబై నగరంలో చక్కర్లు కొడుతుంటుంది. వీలు చిక్కినప్పుడల్లా భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి డిన్నర్ డేట్లకు వెళ్తుంటుంది. ఇలా గురువారం రాత్రి నగరంలోనే ఓ రెస్టారెంట్‌కు ఒంటరిగా డిన్నర్‌ చేయడానికి వెళ్లిందామె. అక్కడ కాసేపు గడిపిన తర్వాత బయటకు వస్తోన్న సమయంలో దీపికకు చేదు అనుభవం ఎదురైంది.

నలిపేసిన ఫ్యాన్.. అది పట్టుకుని లాగడంతో

నలిపేసిన ఫ్యాన్.. అది పట్టుకుని లాగడంతో

డిన్నర్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్ ముందు ఉన్న కారు ఎక్కేందుకు దీపిక పదుకొనే బయటకు వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు అభిమానులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. తమ అభిమాన హీరోయిన్‌ కనిపించడంతో సెల్ఫీలు తీసుకుంటూ ఆటోగ్రాఫ్ కావాలంటూ అరిచి గోల పెట్టారు. అంతేకాదు, అక్కడున్న వాళ్లంతా ఆమె దగ్గరకు చేరి నలిపేశారు.

కేకలు వేసిన దీపిక.. తిరిగి దక్కించుకుంది

కేకలు వేసిన దీపిక.. తిరిగి దక్కించుకుంది

ఫ్యాన్స్ అంతా చుట్టుమట్టడంతో దీపిక పదుకొనేకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సరిగ్గా అప్పుడే ఓ మహిళ.. దీపిక చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను లాగేసింది. దీన్ని ఆలస్యంగా గ్రహించిన ఈ స్టార్ హీరోయిన్ కారు ఎక్కకుండా అక్కడే నిలబడి 'ఏక్ మినిట్.. ఏక్ మినిట్' అంటూ కేకలు వేసింది. దీంతో పక్కనే ఉన్న బాడీగార్డ్స్ దీపిక బ్యాగ్‌ను సదరు మహిళ నుంచి తీసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X