ఎప్పుడూ అవే.. పోర్న్ వీడియోలు చూడమంటూ బలవంతం.. ప్రముఖ కొరియోగ్రాఫర్‌పై ఫిర్యాదు
మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా మీటూ ప్రకంపనలు ఒకానొక దశలో ఉవ్వెత్తున లేచాయి. హాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమం.. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలను కుదిపేశాయి. అప్పటి వరకు మంచితనం ముసుగులో ఉన్నవారి గుట్టు రట్టు చేసింది. ఎంతోమందిని మీటూ చుట్టుముట్టేసింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్, యాక్షన్ కింగ్ అర్జున్ వంటి వారిపైనా మీటూ ఆరోపణలు వచ్చాయి. అయితే అవి నిరూపించే ఆధారాలు లేకపోవడంతో వాటిని కొట్టివేశారు.

మొదలుపెట్టిన తనూశ్రీ దత్తా..
20 ఏళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్' సినిమా సెట్‌లో నటుడు నానా పటేకర్‌ను తనను వేధించాడని, రిహార్సల్స్‌లో భాగంగా తనను అసభ్యంగా తాకాడని తనూశ్రీ దత్తా ఆరోపణలు చేసింది. ఆ సమయంలో పక్కనే ఉన్న గణేష్ ఆచార్య చూస్తూ ఊరుకున్నాడని తెలిపింది.

తాజాగా గణేష్ ఆచార్యపైనే..
అయితే ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపైనే మీటూ వేధింపులు రావడం సంచలనంగా మారింది. లేడీ కొరియోగ్రాఫర్ చేసిన ఈ ఆరోపణలతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. గణేష్ నిత్యం పోర్న్ వీడియోలు చూస్తాడని, చాలా వేధించాడని, తనను కొట్టారంటూ చేసిన ఫిర్యాదు సెన్సేషన్ క్రియేట్ చేసింది.

పోర్న్ వీడియోలు చూడమంటూ..
తానెప్పుడు ఆయన ఆఫీస్‌కు వెళ్లినా.. పోర్న్ వీడియోలు చూస్తూ ఉంటాడని, తనను కూడా చూడమని బలవంత పెట్టేవాడని ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఫిలిం అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ జెనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న గణేష్.. తన నుంచి కమిషన్ తీసుకోవాలని చూశాడని తెలిపింది. అది ఇవ్వకపోయే సరికి పోర్న్ వీడియోలు చూడమని బలవంతం చేసేవాడని చెప్పుకొచ్చింది.
Recommended Video

తీవ్రంగా కొట్టారు..
గణేష్ ఆచార్యపై ఫిర్యాదు చేయాలనుకున్న విషయం తెలుసుకున్న అతను.. తనపై కోపం పెంచుకున్నాడని, అతనితో ఉన్న జయశ్రీ కేల్కర్, ప్రీతి లాడ్‌తో తనను తీవ్రంగా కొట్టించాడని తెలిపింది. మరి వీటిపై గణేష్ ఆచార్య ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. సరోజ్ ఖాన్ లాంటి టాప్ కొరియోగ్రాఫర్ కూాడా గణేష్‌పై ఆరోపణలు చేయడంతో బాలీవుడ్‌లో ఆయన ప్రవర్తనపై అసహనం పెరిగిపోయిందని టాక్.


Click it and Unblock the Notifications











