అట్టర్ ప్లాప్ సినిమా ఎంతపని చేసింది.. ఇంకా షాక్‌లోనే స్టార్ హీరో.. పైకి అలా చెప్పి!

భారీ అంచనాల నడుమ విడుదలైన జీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. షారుఖ్ ని గతః కొన్నేళ్లుగా పరాజయాలు వెంటాడుతున్నాయి. షారుఖ్ తన కెరీర్ లో ఎన్నో పరాజయాల్ని తట్టుకుని నిలబడగలిగారు. కానీ జీరో చిత్ర ఎఫెక్ట్ మాత్రం బాగా తగిలినట్లు ఉంది. జీరో చిత్రం తర్వాత షారుఖ్ భారత తొలి వ్యోమగామి రాకేష్ శర్మ బయోపిక్ లో నటించాల్సింది. కానీ ఈ చిత్రం నుంచి షారుఖ్ చివరి నిమిషంలో తప్పుకున్నాడు. షారుఖ్ తప్పుకోవడంపై ప్రముఖ రచయిత అంజుమ్ రాజబలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరో స్పేస్ మూవీ

మరో స్పేస్ మూవీ

ఉన్నపళంగా షారుఖ్ ఖాన్ రాకేష్ శర్మ బయోపిక్ నుంచి తప్పుకోవడంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. షారుఖ్ మరో ఆసక్తిక్రమైన స్పేస్ చిత్రం చేయబోతున్నారని, దానికి సంబంధించిన కథ రెడీ అయిందని వార్తలు వచ్చాయి. రాకేష్ శర్మ బయోపిక్ కూడా స్పేస్ మూవీనే. వరుసగా రెండు స్పేస్ చిత్రాలలో నటించడం మంచిది కాదని షారుఖ్ రాకేష్ శర్మ బయోపిక్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై రాకేష్ శర్మ బయోపిక్ రచయిత అంజుమ్ రాజబలి స్పందించారు.

అట్టర్ ప్లాప్ ఎఫెక్ట్

అట్టర్ ప్లాప్ ఎఫెక్ట్

షారుఖ్ ఖాన్ రాకేష్ శర్మ బయోపిక్ నుంచి తప్పుకోవడానికి అసలు కారణం అది కాదని అంజుమ్ అన్నారు. ఈ చిత్రం నుంచి తప్పుకునేందుకు పైకి మరో స్పేస్ మూవీలో నటించబోతున్నట్లు చెప్పారు. అసలు కారణం ఏంటంటే.. ఆయన ఇంకా జీరో చిత్ర షాక్ నుంచి కోలుకోలేదు. ఎన్ని ఆశలు పెట్టుకున్న జీరో బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్ర రిజల్ట్ షారుఖ్ పై బాగా ప్రభావం చూపిందని అంజుమ్ అన్నారు. రాకేష్ శర్మ బయోపిక్ పై మనసు పెట్టలేకే తప్పుకున్నారని అన్నారు.

అది కరెక్ట్ కాదు

అది కరెక్ట్ కాదు

జీరో చిత్ర కథ చాలా దారుణంగా ఉందని, అందువలనే ఆ చిత్రం నిరాశపరిచింది అందరూ అంటున్నారు. అది కరెక్ట్ కాదు. జీరో చిత్రాన్ని హిమాన్షు శర్మ కథ అందించారు. ఆయన ఎంతటి ప్రతిభావంతుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కోసారి మనం అనుకున్న విధంగా జరగక[పోవచ్చు. కథలో చిన్న లోపం ఉన్నా కొన్నిసార్లు ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారు. కొన్ని కథలో అనేక లోపాలు ఉన్నా బాగా ఆడుతుంటాయి. కాబట్టి జీరో చిత్రం విషయంలో రచయితని తప్పుబట్టడం సరికాదని అంజుమ్ అన్నారు.

సారే జహాసే అచ్చా

సారే జహాసే అచ్చా

షారుఖ్ తప్పుకోవడంతో రాకేష్ శర్మ బయోపిక్ కోసం రణబీర్ కపూర్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సారే జహాసే అచ్చా అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా జీరో చిత్రం షారుఖ్ ని మానసికంగా కుంగదీయడమే కాక భవిష్యత్తు చిత్రాలపై కూడా ప్రభావం చూపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X