బాలా లాంటి వ్యక్తినే పెళ్లి చేసుకొంటా.. రూ.50 కోట్లతో దుమ్మురేపుతూ.. యామీ గౌతమ్

బాలీవుడ్‌, దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో టాలెంటెడ్ హీరోయిన్లలో యామీ గౌతమ్ ఒకరు. గత కొద్దికాలంగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. తాజాగా బాలా అనే చిత్రంలో విలక్షణ పాత్రతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ చిత్రంలో టిక్‌టాక్ స్టార్ పాత్రలో నటించి విమర్శల ప్రశంసలు అందుకొంటున్నారు. ఈ చిత్రం వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో యామీ గౌతమ్ మీడియాతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

బాలా చిత్రం గురించి

బాలా చిత్రం గురించి

యవ్వనంలోనే బట్టతలతో బాధపడే యువకుడి పాత్ర నేపథ్యంగా బాలా చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా బట్టతలతో బాధపడే యువకుడి పాత్రను పోషించారు. బట్టతలతో ఆయుష్మాన్ అద్భుతంగా నటించారు. సినిమా చూసే ప్రతీ ప్రేక్షకుడు ఆయన నటనకు ఫిదా అవుతారు. ఆ పాత్రతో ప్రేమలో పడుతారు. తొలిసారి నేను టిక్ టాక్ క్వీన్ పాత్రలో నటించాను అని యామీ గౌతమ్ పేర్కొన్నారు.

పరి పాత్ర గురించి

పరి పాత్ర గురించి

బాలా చిత్రంలో నా పాత్ర పేరు పరి. ఈ రోల్ ఆఫర్ చేసినప్పుడు డైరెక్టర్ నాకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ‘పరి‘ పాత్ర మాదిరిగానే బిహేవ్ చేయాలి. నాకు యామీ గౌతమ్ ఎక్కడా కనిపించకూడదు అనే చెప్పారు. ఆ పాత్రను అర్ధం చేసుకొని పరిగానే నటించాను అని యామీ గౌతమ్ అన్నారు. తన పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

బట్టతల వ్యక్తుల గురించి

బట్టతల వ్యక్తుల గురించి

నీ జీవితంలో బట్టతల ఉండే భర్తను పెళ్లి చేసుకొంటావా? అనే ప్రశ్నకు యామీ గౌతమ్ సమాధానమిస్తూ.. అలాంటి వాళ్లు చాలా కూల్‌గా ఉంటారు. వారి మనస్తత్వం కూడా చాలా కూల్‌గా ఉంటుంది. బట్టతల ఉన్న వ్యక్తిని అవసరమైతే పెళ్లి చేసుకొంటాను. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఆ తర్వాత మరొకరు ప్రేమించాలి కోరుకోండి అనే బేసిక్ పాయింట్‌తో బాలా సినిమా తెరకెక్కింది అని యామీ గౌతమ్ అన్నారు. ముంబైలో ఏర్పాటు చేసిన స్క్రీన్ అనంతరం మీడియాతో మాట్లాడాడింది.

Recommended Video

Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
నాలుగు రోజుల్లో రూ.50 క్లబ్‌లో

నాలుగు రోజుల్లో రూ.50 క్లబ్‌లో

గత శుక్రవారం రిలీజైన బాలా చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. తొలివారాంతం తర్వాత నాలుగో రోజున రూ.8.26 కోట్లు వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.52.21 కోట్లు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X