For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లిపై అల్లు శిరీష్ హీరోయిన్ క్లారిటీ: అప్పుడే ప్రేమ.. అందుకే సీక్రెట్‌గా.. ఫొటోలు వైరల్!

  |

  మిగిలిన సినీ ఇండస్ట్రీలతో పోలిస్తే.. బాలీవుడ్‌లోనే ప్రేమ కహానీలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అక్కడ ప్రేమలు.. పెళ్లిళ్లు.. బ్రేకప్‌లు సర్వసాధారణం అయిన విషయంలా మారిపోయింది. అందుకే ఇప్పటికీ ఎంతో మంది ఇలాంటి వ్యవహారాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక, హిందీ పరిశ్రమలో ఎంతో మంది ప్రేమాయణం సాగిస్తున్నారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఆ బంధాన్ని పెళ్లి పీటల వరకూ తీసుకెళ్తున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ యామీ గౌతమ్.. డైరెక్టర్ ఆదిత్య ధార్ జంట ఒకటి. ఈ కపుల్ పెళ్లిపై తాజాగా క్లారిటీ వచ్చేసింది. వివరాల్లోకి వెళ్తే...

  యామీ అలా పరిచయం.. ఇలా పాపులర్

  యామీ అలా పరిచయం.. ఇలా పాపులర్

  ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ద్వారా ప్రపంచానికి పరిచయం అయింది యామీ గౌతమ్. ఆ సమయంలోనే ‘ఉల్లాస ఉత్సాహ' అనే కన్నడ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ వెంటనే పంజాబీ చిత్రంలోనూ నటించింది. ఈ క్రమంలోనే ‘నువ్విలా' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. ఆ తర్వాత దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోకి సైతం ప్రవేశించింది.

  తెలుగులోనూ ఎంటర్.. యంగ్ హీరోలతో

  తెలుగులోనూ ఎంటర్.. యంగ్ హీరోలతో

  ‘నువ్విలా' అనే సినిమాతో తెలుగు గడప తొక్కిన యామీ గౌతమ్.. ఆ తర్వాత అల్లు వారి అబ్బాయి శిరీష్ నటించిన ‘గౌరవం' అనే చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత ‘యుద్ధం', యూత్ స్టార్ నితిన్‌తో ‘కొరియర్ బాయ్ కల్యాణ్' అనే సినిమాల్లోనూ నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని అందించలేదు. దీంతో టాలీవుడ్‌కు బైబై చెప్పేసింది. కానీ, మిగిలిన భాషల్లో చేస్తూనే ఉంది.

  ఎన్నో రకాలుగా ఆదిత్య ధార్.. ఆ మూవీ

  ఎన్నో రకాలుగా ఆదిత్య ధార్.. ఆ మూవీ

  ఆదిత్య ధార్ బాలీవుడ్‌లో ఎంతో కాలంగా తెర వెనుక పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 2008లో వచ్చిన ‘కాబూల్ ఎక్స్‌ప్రెస్' చిత్రానికి లిరిక్స్ అదించడం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత పలు చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా కూడా పని చేశాడు. ఈ క్రమంలోనే ‘ఉరి: ద సర్జికల్ స్ట్రయిక్స్'తో డైరెక్టర్‌గా మారాడు. ఈ చిత్రంతో ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు.

  అప్పుడే మొదలైన ప్రేమ... స్పందించలే

  అప్పుడే మొదలైన ప్రేమ... స్పందించలే

  ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ‘ఉరి: ద సర్జికల్ స్ట్రయిక్స్' మూవీలో యామీ గౌతమ్ హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా చేస్తోన్న సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ లవ్ ట్రాక్ నడుపుతూ వచ్చారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరి గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేసినా.. వాటిపై మాత్రం స్పందించలేదు. దీంతో వీళ్ల లవ్ గురించి క్లారిటీ రాలేదు.

  సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రేమజంట

  సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రేమజంట

  చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తూ వస్తున్న యామీ గౌతమ్.. ఆదిత్య ధార్ ఈ శుక్రవారం అంటే జూన్ 4న అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఎవరికీ తెలియకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం ముందు నుంచే హాట్ టాపిక్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి వీళ్లిద్దరి సంగీత్, మెహందీ ఫంక్షన్లకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారిపోయాయి.

  పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన యామవీ గౌతమ్

  పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన యామవీ గౌతమ్

  సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకోవడంతో ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా హైలైట్ అయిపోయింది. దీంతో దీనిపై యామీ గౌతమ్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ మేరకు తమ పెళ్లికి సంబంధించిన ఫోటోను షేర్ చేసిన ఈ బ్యూటీ.. ‘మా కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో ఈరోజు మేమిద్దరం అగ్నిసాక్షిగా ఒక్కటయ్యాము' అని వెల్లడించింది.

  Actor Altaf Hassan About His Struggles | Battala Ramaswami Biopikku
  అందుకే మ్యారేజ్ సీక్రెట్‌గా.. ఫొటోలు వైరల్

  అందుకే మ్యారేజ్ సీక్రెట్‌గా.. ఫొటోలు వైరల్

  ఇదే పోస్టులో ‘మేము ఎప్పుడైతే ప్రేమను మొదలు పెట్టామో.. అప్పటి నుంచే మీ మద్దతు, ఆశీర్వాదాలు ఉండాలని కోరుకున్నాం' అంటూ చెప్పుకొచ్చారు యామీ గౌతమ్.. ఆదిత్య ధార్. ఇక, తమ పెళ్లిని గ్రాండ్‌గా చేసుకుందామకున్నామని.. కానీ, కరోనా నిబంధనల వల్లే సీక్రెట్‌గా చేసుకోవాల్సి వచ్చిందని ఈ పోస్టు ద్వారా పరోక్షంగా వివరించిందీ జంట. మరోవైపు ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.

  English summary
  Bollywood Heroine Yami Gautam and Director Aditya Dhar tied the knot on Friday. Now She Shared Marriage Photo.. And Clarity on This.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X