పెళ్ళైన హీరోతో రొమాన్స్, కాపురంలో చిచ్చు.. ఆ మాటెత్తగానే నన్నొదిలేయండి ప్లీజ్ అంటూ!

అందాల భామ యామి గౌతమ్ వెండి తెరపై కంటే బుల్లి తెరపైనే ఎక్కువా కనిపిస్తూ ఉంటుంది. వాలు వాణిజ్య ప్రకటనలతో యామి గౌతమ్ రాణించిన సంగతి తెలిసిందే. ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి ఉత్పత్తులకు యామి గౌతమ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. యామి గౌతమ్ కు అన్ని భాషల్లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. కానీ విజయాలు శాతం తక్కువ. అందుకే స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. మూడుపదుల వయసుకు చేరుకున్న యామి గౌతమ్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 ప్లీజ్ నన్నొదిలేయండి

ప్లీజ్ నన్నొదిలేయండి

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీ పెళ్ళెప్పుడు అనే ప్రశ్న యామిని గౌతమ్ కు ఎదురైంది. దీనిపై యామిని స్పందిస్తూ..ఈ ఏడాది బాలీవుడ్ లో చాలా వివాహాలు జరిగాయి. దీపికా, సోనమ్, ప్రియాంక లాంటి సెలెబ్రిటీలంతా పెళ్లి చేసుకున్నారు. ఆ వార్తలతో మీడియా మొత్తం బిజీగా ఉంది. కాబట్టినన్నొదిలేయండి ప్లీజ్ అంటూ రిక్వస్ట్ చేసింది. తనకు పెళ్లి చేసుకోవాలనే తొందర లేదంటూ సమాధానం ఇచ్చింది.

ఎలాంటి రిలేషన్స్ లేవు

ఎలాంటి రిలేషన్స్ లేవు

ప్రస్తుతం తనకు ఎలాంటి రిలేషన్ షిప్స్ కూడా లేవని పెళ్లి చేసుకునేంత వరకు ఒంటరిగానే ఉంటానని తేల్చి చెప్పింది. పెళ్లి గురించి కనీసం ఆలోచన కూడా చేయడం లేదు అని తెలిపింది. గతంలో యామి గౌతమ్ ప్రేమ వ్యవహారం ఒకటి తీవ్ర వివాదాన్ని రేపింది. ఆ జ్ఞాపకాల నుంచి బయట పడ్డ ఈ భామ ఇకపై ప్రేమ జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకుంది.

 పెళ్ళైన నటుడితో

పెళ్ళైన నటుడితో

2014లో యామి గౌతమ్ బాలీవుడ్ నటుడు పుల్కిట్ సామ్రాట్ తో ఘాటు ప్రేమాయణం సాగించింది. సామ్రాట్ కు పెళ్ళైపోయినా కానీ యామి గౌతమ్ అతడితో ప్రేమలో ఉందని అప్పట్లో ఘాటు వార్తలు వచ్చాయి. యామి, సామ్రాట్ ప్రేమ వ్యవహారం బాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపింది. యామి గౌతమ్ కారణంగా పుల్కిట్ సామ్రాట్ వైవాహిక జీవితం కూడా చిన్నాభిన్నమైంది. అతడి భార్య శ్వేత రోహిర 2015లో పుల్కిట్ నుంచి విడిపోయింది.

కాపురాలు కూల్చేది అంటూ నిందలు

కాపురాలు కూల్చేది అంటూ నిందలు

శ్వేత రోహిర ఆ సమయంలో యామి గౌతమ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. యామి గౌతమ్ వలన తన వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చి భర్త నుంచి విడిపోయానని తెలిపింది. ఆమె కాపురాలు చూల్చే వగలాడి అంటూ శ్వేత తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సంఘటనలన్నీ బాధించాయో ఏమో కానీ అప్పటి నుంచి యామి గౌతమ్ ప్రేమ, పెళ్లి లాంటి మాటలు కనీసం వినడానికి కూడా ఇష్టపడడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X