For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమీర్‌ మూవీలో దక్షిణాది టాప్ కమెడియన్.. బాలీవుడ్ నుంచి పిలుపు.. లక్ అంటే అదీ

|

బాలీవుడ్‌లో మరో ప్రతిష్టాత్మకమైన మూవీకి రంగం సిద్ధమైంది. మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా అనే చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ వైపు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో యూనిట్ బిజీగా ఉండగా, మరో పక్క ఈ సినిమాను అనేక ఊహాగానాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఈ సినిమా కోసం దక్షిణాదికి టాప్ హీరోను తీసుకొంటారనే విషయం పక్కన పెడితే.. తాజాగా ఓ టాప్ కమెడియన్‌ను సంప్రదించారనే వార్త సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషనల్‌గా మారింది. ఆ హీరో, కమెడియన్ ఎవరంటే..

అమీర్ ఖాన్ మూవీలో విజయ్ సేతుపతి

అమీర్ ఖాన్ మూవీలో విజయ్ సేతుపతి

లాల్ సింగ్ చద్దా సినిమా గురించి కొద్ది రోజులుగా మీడియాలో సెన్సేషనల్ వార్తలు కనిపిస్తున్నాయి. టామ్ హంక్స్ తెరకెక్కించిన ఫారెస్ట్ గంప్ సినిమాను రీమేక్‌గా తీస్తూ రూపొందించిన ఈ చిత్రంలో సౌత్ స్టార్ విజయ్ సేతుపతి నటిస్తున్నారనే వార్త సంచలనం రేపింది. అయితే దానిపై ఏ మాత్రం క్లారిటీ రాలేదు. అంతలోనే మరో కమెడియన్‌ను ఈ ప్రాజెక్టులో చేరుతున్నారనే విషయం మరింత ఆసక్తిని పెంచింది.

Aamir Khan Apologises For Thugs Of Hindostan Failure | Filmibeat Telugu
యోగి బాబుతో సంప్రదింపులు

యోగి బాబుతో సంప్రదింపులు

దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ ఉన్న కమెడియన్లలో యోగిబాబు ఒకరు. కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా రాణిస్తున్నాడు. తాజాగా యోగిబాబును కూడా లాల్ సింగ్ చద్దాలో నటింప జేయాలని సినిమా వర్గాలు ప్రయత్నించారట. ఆ క్రమంలో మారి మధ్య చర్చలు కూడా జరిగాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఏ పాత్ర కోసం యోగిబాబు అంటే

ఏ పాత్ర కోసం యోగిబాబు అంటే

ఫారెస్ట్ గంప్ సినిమాలో బుబ్బా అనే పాత్రకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. వియత్నాం యుద్ధంలో పోరాటం చేస్తూ వీరమరణం పొందే పాత్ర కోసం యోగిబాబును అడిగినట్టు సినీ వర్గాల సమాచారం. సినిమాలో ఈ పాత్ర ఆద్యంతం వినోదాన్ని పండిస్తూ.. చివర్లో భావోద్వేగానికి గురిచేస్తుంది. ఈ పాత్రకు యోగిబాబు పేరును పరిశీలనకు రావడంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

దర్బార్, బిగిల్ చిత్రంలో

దర్బార్, బిగిల్ చిత్రంలో

ప్రస్తుతం యోగిబాబు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తమిళ స్టార్ విజయ్ నటించిన బిగిల్ సినిమాలోనూ, అలాగే మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న దర్బార్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల ఆయన హీరోగా నటించిన గూర్ఖా సినిమా రిలీజైన సంగతి తెలిసిందే.

కరీనా కపూర్ హీరోయిన్‌గా

కరీనా కపూర్ హీరోయిన్‌గా

ఇక ఆస్కార్ అవార్డు స్థాయి చిత్రం ఫారెస్ట్ గంప్ ఆధారంగా రూపొందుతున్న లాల్ సింగ్ చద్దాలో అమీర్ సరసన కరీనా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నది. వివేక్ ముష్రాన్, మానవ్ గోహిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో అమీర్ ఖాన్ కుమారుడు కూడా భాగస్వామ్యం అవుతున్నట్టు సమాచారం.

English summary
South's top comedian Yogi Babu's bollywood entry on cards. He is approached by Mr Perfect Aamir Khan's Lal Singh Chaddha unit members. He is considered for makers for the role of Bubba, who dies fighting in the Vietnam War alongside Forrest Gump.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more