twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ సినిమాను తిరస్కరించిన యంగ్ హీరో.. తల పట్టుకుంటున్న డైరెక్టర్

    |

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రాల్లో 'కాటమరాయుడు' ఒకటి. తమిళంలో అజిత్ నటించిన 'వీరం' అనే సినిమాకు రీమేక్‌గా వచ్చిందీ చిత్రం. ఇందులో పవన్ సరసన శృతీ హాసన్ నటించింది. శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమాను కిషోర్ పార్థ‌సాని(డాలీ) తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ అయింది. చాలా మంది పవన్ గెటప్‌ను ఫాలో అయిపోయారు. ఇది అప్పట్లో ట్రెండ్ అయింది. అయితే, ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు పవన్ అభిమానులు నిరాశకు గురయ్యారు.

    సాజిద్‌ నదియాద్‌వాలా ఈ సినిమా రీమేక్ హక్కులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇదే సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా కథను మొదట స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు వినిపించారు. కానీ, అక్షయ్‌ ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయడానికి అంగీకారం తెలుపలేదు. అయితే, అదే సమయంలో 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' ద్వారా స్టార్ హీరోగా మారిన విక్కీ కౌశల్‌ను సంప్రదించారు.

    Young Hero Reject Pawan Kalyan Movie

    దీనికి అతడు ఓకే చెప్పేశాడు. దీంతో బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్లుగా ఈ స్క్రిప్టులో కొన్ని మార్పలు చేశారు. 'ల్యాండ్‌ ఆఫ్‌ లుంగీ' అనే టైటిల్ అనుకున్నారు. ఇక, సినిమా పట్టాలెక్కుతుంది అని భావిస్తున్న తరుణంలో విక్కీ అర్థాంతరంగా తప్పుకున్నాడు. దీనికి కారణం అతడు 'కిట్టీ' అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడమేనని తెలుస్తోంది. డేట్స్ సర్ధుబాటు చేయలేని కారణంగా ఆయన ఈ సినిమా చేయలేనని దర్శక, నిర్మాతలకు చెప్పేశాడని టాక్ వినిపిస్తోంది. దీంతో కొత్త హీరోను అన్వేషించే పనిలో బిజీగా ఉన్నారు సదరు ఫిల్మ్ మేకర్లు.

    English summary
    Katamarayudu is a Telugu movie in which Power star Pawan Kalyan and Shruthi Haasan played the lead role and it was directed by Kishore Kumar Pardasani. The movie is being remade in Bollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X