నీ మొగుడు అతడితో ఇంకా.. స్టార్ హీరో భార్యపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
Recommended Video

తనుశ్రీ దత్త చేస్తున్న సంచలన వ్యాఖ్యలు బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. ప్రముఖులపై లైంగిక ఆరోపణలతో తనుశ్రీ సంచలనం సృష్టిస్తోంది. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా తనుశ్రీ దత్త ఇటీవలే అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ బాలీవుడ్ లో హీరోయిన్లపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి వాస్తవాలు బయట పెడుతోంది. నానా పాటేకర్ వంటి దిగ్గజ నటుడిపైనే తనుశ్రీ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ ప్రముఖుల నుంచి తనుశ్రీ దత్తకు మద్దత్తు లభిస్తుండడం విశేషం.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

పదేళ్ల క్రితం
పదేళ్ల ముందు జరిగిన సంగతులని తనిశ్రీ తాజాగా బయట పెడుతోంది. 2008 లో హార్న్ ఓకే ప్లీజ్ చిత్ర షూటింగ్ సందర్భంగా నానా పాటేకర్ తనని లైంగికంగా వేధించాడని ఇటీవల తనుశ్రీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వందలాది మంది సెట్ లో ఉండగానే వారందరిని బయటకు పంపి డాన్స్ పేరుతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించింది.

దర్శకుడిపై కూడా
చాక్లెట్ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై కూడా తనుశ్రీ సంచలన వ్యాఖ్యలు చేసింది. షూటింగ్ లో తన షాట్ లేకున్నా వచ్చి సెక్సీ డాన్స్ చేయమని వేధించాడని ఆరోపించింది. ఆ సమయంలో తనకు ఇర్ఫాన్ ఖాన్, సునీల్ శెట్టి అండగా నిలిచినట్లు తనుశ్రీ వెల్లడించింది.

తీవ్రస్థాయిలో వివాదం
తనుశ్రీ వ్యాఖ్యలతో బాలీవుడ్ లో తీవ్రస్థాయిలో దుమారం రేగుతోంది. నానా పాటేకర్ మద్దత్తు దారులు తనుశ్రీపై విరుచుకుపడుతున్నారు. తనుశ్రీకు కూడా బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఊహించని మద్దత్తు లభిస్తోంది.

ప్రియాంక చోప్రా కూడా
స్టార్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా, ఫరాన్ అక్తర్, స్వర భాస్కర్, సోనమ్ కపూర్ తోపాటు హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా తనుశ్రీ దత్తకు మద్దత్తు తెలిపారు. మద్దత్తు తెలిపిన వారందరికీ తనుశ్రీ కృతజ్ఞతలు తెలియజేసింది. అదే సమయంలో ట్వింకిల్ ఖన్నాపై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

నీ మొగుడు ఇప్పటికి
బాలీవుడ్ నుంచి తనకు అందుతున్న మద్దతుపై తనుశ్రీ తాజాగా మాట్లాడింది. మద్దత్తు తెలుపుతున్న వారికీ ధన్యవాదాలు. ట్వింకిల్ ఖన్నా కూడా నాకు సపోర్ట్ గా నిలిచారు. కానీ ఆమె ఒక విషయం ఆలోచించాలి. ఆమె భర్త అక్షయ్ కుమార్ ఇప్పటికీ నానా పాటేకర్ తో సినిమాలు చేస్తున్నాడు. దీనివల్ల ఆమె నిజాయతీతో తనకు సపోర్ట్ గా నిలిచిందని ఎలా అనుకోవాలి.

క్షమాపణ చెప్పలేదు
నన్ను లైంగికంగా వేధించిన నానా పాటేకర్ ఇంతవరకు క్షమాపణలు చెప్పలేదు. పైగా కొన్ని అబద్దపు కథలు అల్లే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి వ్యక్తితో నీ భర్త సినిమాలు చేస్తున్నాడు. మీరేమో నాకు సపోర్ట్ అంటూ ప్రకటిస్తున్నారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలని అని తనుశ్రీ దత్త ట్వింకిల్ ఖన్నాపై మండిపడింది.


Click it and Unblock the Notifications











