twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రికెట్ నుంచి యువరాజ్ సింగ్ రిటైర్మెంట్... ఏడుగురు బాలీవుడ్ భామలతో ఎఫైర్లు!

    |

    2011 ప్రపంచకప్‌ హీరో, భారత క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు సోమవారం రిటైర్మెంట్‌ ప్రకటించారు. బీసీసీఐతో చర్చలు జరిపిన అనంతరం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి యువరాజ్‌ సింగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‍‌కు కూడా యువీ వీడ్కోలు పలికారు.

    దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన యువీ క్రికెట్ ప్రయాణం నేటితో ముగిసింది. 37 ఏళ్ల యువరాజ్ ఈ ప్రయాణంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నారు. నవంబ్ 12, 2015లో హజిల్ కీచ్‌ను పెళ్లాడి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న యువరాజ్ పెళ్లికి ముందు పలువురు బాలీవుడ్ తారలతో ఎఫైర్లు నడిపినట్లు వార్తల్లోకెక్కారు.

    మొదటి సారి కిమ్ శర్మతో వార్తల్లోకి...

    మొదటి సారి కిమ్ శర్మతో వార్తల్లోకి...

    యువరాజ్ సింగ్ మొదటి లవ్ ఎవరు? అంటే అందరూ ముందుగా చెప్పేది కిమ్ శర్మ పేరు. అప్పట్లో ఇద్దరూ చట్టపట్టాలేసుకుని తిరుగుతూ మీడియాకెక్కారు. దాదాపు నాలుగేళ్ల డేటింగ్ అనంతరం 2007లో ఇద్దరూ విడిపోయారు. అప్పట్లో వీరి మధ్య బ్రేకప్ ఏర్పడటానికి కారణం కిమ్ శర్మ అబ్యూసివ్ నేచరే అనే ప్రచారం జరిగింది. యువరాజ్ సింగ్ తల్లి ఒప్పుకోక పోవడం వల్లనే వీరు విడిపోయారనే మరో ప్రచారం కూడా ఉంది.

    ప్రీతి జింగ్యానీ

    ప్రీతి జింగ్యానీ

    కిమ్ శర్మతో బ్రేకప్ తర్వాత... యువరాజ్ సింగ్ మరో బాలీవుడ్ నటి ప్రీతి జింగ్యానీతో ప్రేమలో పడ్డట్లు వార్తలు వెలువడ్డాయి. కొంతకాలం పాటు వీరు డేటింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది కానీ... ఈ విషయాన్ని ఇద్దరూ ధృవీకరించలేదు.

    ప్రీతి జింతా

    ప్రీతి జింతా

    బాలీవుడ్ నటి, కింగ్స్ లెవెన్ పంజాబ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింతాతో కూడా యువరాజ్ సింగ్ డేటింగ్ చేసినట్లు అప్పట్లో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది, వీరి కలిసి ఉన్న ఫోటోలు కూడాసర్క్వ్యూలేట్ అయ్యాయి. అప్పట్లో ఈ జట్టుకు యువరాజ్ సింగ్ ఆడటమే ఇందుకు కారణం. అయితే ఈ వార్తలను ప్రీతి జింతా ఖండించారు.

    దీపిక పదుకోన్

    దీపిక పదుకోన్

    యువరాజ్ సింగ్ లవర్ల జాబితాలో దీపిక పదుకోన్ పేరు కూడా వినిపించింది. 2007లో టి20 వరల్డ్ కప్ టోర్నీలో యూవి టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సమయంలో దీపిక పదుకోన్ స్టాండ్స్‌ ఉండి చీర్స్ చెప్పడంతో పాటు అతడి కోసం బర్త్ డే పార్టీ హోస్ట్ చేయడంతో ఈ వార్తలు గుప్పుమన్నాయి.

    రియా సేన్

    రియా సేన్

    దీపిక పదుకోనెతో యువరాజ్ సింగ్ బ్రేకప్ అయిందనే వార్తలు వచ్చిన కొద్ది రోజులకే బెంగాళీ బ్యూటీ రియా సేన్‌తో అతడు ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరిగింది. ఓ పార్టీలో వీరు కలిశారని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని చర్చించుకున్నారు. ఇద్దరూ కలిసున్న ఫోటోలు సైతం ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.

    మినిషా లాంబా

    మినిషా లాంబా

    మినిషా లాంబా, యువరాజ్ సింగ్ ముద్దు ఫోటో 2011లో లీక్ కావడంతో వీరి మధ్య ఎఫైర్ మొదలైందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వార్తలను మినిషా ఖండించింది. ఆ ఫోటోలో ఉన్నది తాను కాదని, తనలా ఉండే మరొక వ్యక్తి అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది.

    నేహా ధూపియా

    నేహా ధూపియా

    యువరాజ్ సింగ్ రొమాంటిక్ లైఫ్‌లో నేహా ధూపియా కూడా ఉందనే వార్తలు 2014లో హల్ చల్ చేశాయి. ఇద్దరూ కలిసి సోఫీ చౌదరి బర్త్ డే పార్టీకి హాజరు కావడం, చాలా క్లోజ్‌గా మూవ్ అవ్వడంతో ఈ వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఇందులో నిజం లేదని నేహా ధూపియా స్పష్టం చేశారు.

    English summary
    Yuvraj Singh announces retirement. Yuvraj Singh, India's hero in the World Cup 2011, announced his retirement from international cricket on Monday (June 10) after a glittering career that lasted nearly two decades.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X