twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోషల్ మీడియాలో అలాంటి ఫొటోలు.. దయచేసి తొలగించండి.. దంగల్ నటి ఆవేదన

    |

    సినిమా తారలు నటీమణులు కొన్నిసార్లు ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రైవసీ కావాలని ఎంత కోరుకున్నా కూడా కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాటుల వలన వివాధల్లోకి వెళ్లాల్సి వస్తోంది. ఇక తేడా వస్తే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటారు. ఇక దంగల్ సినిమాలో నటించిన జైరా వసీం ఇటీవల సోషల్ మీడియాలో తన అవేధనను బయట పెట్టింది. నా ఫొటోలను తొలగించండి అంటూ అభిమానులను వేడుకుంది.

    ఆ సినిమాతో భారీ క్రేజ్..

    ఆ సినిమాతో భారీ క్రేజ్..

    దంగల్ సినిమాలో మెయిన్ లీడ్ చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించిన జైరా వసీమ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ అందుకుంది. దంగల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల కోట్లకు పైగా వసూళ్లను అందుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత అమీర్ ఖాన్ నిర్మించిన సీక్రెట్ సూపర్ స్టార్ లో కూడా మెయిన్ లీడ్ లో నటించి బాక్సాఫీస్ హిట్ అందుకుంది జైరా.

    నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది

    నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది

    అసలు మ్యాటర్ లోకి వస్తే చాలా రోజుల తరువాత సోషల్ మీడియాలోకి వచ్చిన జైరా వసీమ్ ఒక ఎమోషనల్ పోస్ట్ తో తన అభిమానులను అభ్యర్ధించింది. దంగల్ సినిమా ఎప్పుడైతే హిట్ టాక్ తెచ్చుకుందో అప్పటి నుంచే జైరాకు ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఆమె కొన్నిసార్లు చేసిన పనులకు మతపరమైన ఇబ్బందులు, నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

    నాకు సహాయం చేయండి

    నాకు సహాయం చేయండి

    ఇక ఆమె ఈ విధంగా తెలిపింది. నాపై చూపిస్తున్న మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. నాకెంతో సపోర్ట్ చేశారు. మీరు చూపించే అభిమానాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక హెల్ప్ అడగాలని అనుకుంటున్నాను. అదేమిటంటే.. దయచేసి సోషల్ మీడియాలో ఉన్న నా ఫోటోలన్నిటిని డిలీట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఫ్యాన్ పేజ్ లు క్రియేట్ చేసినవారికి కూడా ఈ విషయం తెలియాలి.. అని తెలిపింది.

    ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని..

    ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని..

    అయితే ఇంటర్నెట్ ప్రపంచంలో ఉన్న ఫోటోలన్నింటిని తొలగించడం సాధ్యం కాదు కాబట్టి ఇక నుంచి ఎవరు కూడా నా ఫొటోలను షేర్ చేయవద్దు. ఇప్పటివరకు ఎలాగైతే ప్రతి విషయంలో మద్దతు ఇచ్చారో ఈ విషయంలో కూడా అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా లైఫ్ లో ఒక కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను మీరు చేసే సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుందని జైరా తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.

    English summary
    Movie stars and actresses are sometimes facing a lot of difficulties in the internet world. No matter how much you want privacy, sometimes you have to go into conflicts due to small mistakes. Feel very emotional when the difference comes. Zaira Wasim, who starred in the film Dangal, recently took to social media to express her displeasure. I begged the fans to delete my photos.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X