షాకింగ్: బైక్‌ని గుద్దేసిన ప్రముఖ హీరోయిన్ కారు.. వ్యక్తి దుర్మరణం!
Recommended Video

తరచుగా సెలెబ్రిటీల వాహనాలు ప్రమాదానికి గురవుతుండడం ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. ఏదో ఒక పొరపాటు వలన వాహన ప్రమాదాలు జరిగితే తీరని నష్టం వాటిల్లుతుంది. తాజాగా గోవాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ బాలీవడో నటి ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు కారణం అయింది. దీనితో సదరు హీరోయిన్ కారుడ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ ప్రమాదం బుధవారం సాయంత్రం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి సంబందించిన పూర్తి వివరాలు చూద్దాం!

హేట్ స్టోరీ 3 హీరోయిన్ జరీన్ ఖాన్
హేట్ స్టోరీ 3, సల్మాన్ ఖాన్ వీర్ చిత్రాలతో జరీన్ ఖాన్ బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. వాజహ్ తుమ్ హో, హౌస్ ఫుల్ 2 లాంటి చిత్రాల్లో కూడా జరీన్ ఖాన్ నటించింది. జరీన్ ఖాన్ ఎక్కువగా గ్లామర్ పాత్రలోనే నటించింది. ఇప్పుడు కూడా జరీన్ ఖాన్ పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదం హాట్ టాపిక్ గా మారింది.

బైక్‌ని గుద్దేసిన హీరోయిన్ కారు
గోవాలో ప్రయాణిస్తున్న జరీన్ ఖాన్ వాహనం బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తిని గుద్దేసినట్లు తెలుస్తోంది. దీనితో ఆ వ్యక్తి తలకు బలమైన గాయం అయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మరణించారు. అతడు హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జరీన్ ఖాన్‌కు కూడా
ఈ ప్రమాదంలో జరీన్ ఖాన్ కు కూడా స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరీన్ ఖాన్ క్షేమంగానే ఉందట. పోలీసులు జరీన్ ఖాన్ కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కారు ప్రమాదం జరిగిన వెంటనే బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి డివైడర్ పై పడడంతో తలకు పెద్ద గాయం అయినట్లు తెలుస్తోంది.

ఇటీవలే వార్తల్లో
జరీన్ ఖాన్ ఇటీవలే వార్తల్లో నిలిచింది. తనకు గతంలో మేనేజర్ గా పనిచేసిన వ్యక్తి అసభ్యకరమైన సందేశాలు పంపిస్తుండడంతో జరీన్ ఖాన్ అతడిపై కేసు నమోదు చేసింది. సల్మాన్ ఖాన్ వీర్ చిత్రంతోనే జరీన్ ఖాన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదం జరీన్ ఖాన్ కు మరింత చిక్కులు తెచ్చిపెట్టింది.


Click it and Unblock the Notifications











