పబ్లిగ్గా చెంప పగలగొట్టిన హీరోయిన్.. మళ్ళీ వార్తల్లోకి!
Recommended Video

హీరోయిన్ జరీన్ ఖాన్ ప్రస్తుతం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. తన ప్రమేయం లేకుండా ఆమె ఇబ్బందుల్లో చిక్కుకుంటోంది. గ్లామర్ పాత్రలతో జరీన్ ఖాన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. హేట్ స్టోరీ 3, వీర్ లాంటి చిత్రాల్లో జరీన్ ఖాన్ నటించింది. తాజాగా జరీన్ ఖాన్ ఔరంగాబాద్ లో చేదు అనుభవం ఎదుర్కొంది. ఓ ఎంటర్ టైన్మెంట్ పోర్టల్ లాంచ్ సందర్భంగా జరీన్ ఖాన్ అక్కడి అభిమానుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంది. దీనితో జరీన్ ఖాన్ సహనం కోల్పోయే పరిస్థితి తలెత్తిందట.

జరీన్ ఖాన్ ముఖ్య అతిధిగా
జరీన్ ఖాన్ వస్తుందని తెలియడంతో ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ఓ ఎంటర్‌టైన్మెంట్ పోర్టల్ లాంచ్ కోసం జరీన్ ఖాన్ ముఖ్య అతిధిగా హాజరైంది. జరీన్ ఖాన్ రాగానే నిర్వాహకులు, పోలీసులు అభిమానులని అదుపు చేయలేకపోయారు. దీనితో అక్కడ అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
చెంప చెళ్లుమనేలా
చాలా మంది అభిమానులు మీద పడడంతో జరీన్ ఖాన్ అక్కడి నుంచి కదలలేకపోయిందట. ఓ అభిమానులు జరీన్ ఖాన్ ని అసభ్యంగా తాకిన ఘటన చోటుచేసుకుంది. దీనితో జరీన్ ఖాన్ తీవ్ర ఆగ్రహంతో అతడి చెంప చెళ్లుమనిపించింది. ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత జరీన్ ఖాన్ సురక్షితంగా కారు ఎక్కించి పంపించారు.

బుద్ధిలేని వెధవ ఒకడు
ఈ సంఘటన గురించి జరీన్ ఖాన్ స్పందించింది. అభిమానుల గుంపులో ఓ బుద్ధిలేని వేదవ నన్ను అసభ్యంగా తాకాడు. అక్కడే వాడి చెంప పగలగొట్టి ఎలాగోలా గుంపు నుంచి బయట పడ్డానని జరీన్ ఖాన్ తెలిపింది. పలు సందర్భాల్లో హీరోయిన్లు అభిమానుల నుంచి ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు.

తరచుగా వార్తల్లో
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం విషయంలో జరీన్ ఖాన్ వార్తల్లో నిలిచింది. జరీన్ ఖాన్ కారు ఇటీవల బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అతడు మరణించాడు. ఆ సమయంలో జరీన్ ఖాన్ డ్రైవర్ కారుని నడుపుతున్నాడు. దీనితో జరీన్ ఖాన్ డ్రైవర్ పై కేసు నమోదైంది. అంతకు ముందు జరీన్ ఖాన్ వద్ద గతంలో మేనేజర్ గా పనిచేసిన వ్యక్తి అసభ్యంగా సందేశాలు పంపిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications











