స్వలింగ సంపర్కురాలిని కాదు.. కానీ మగరాయుడిని... హాట్ హీరోయిన్ సంచలన కామెంట్!
బాలీవుడ్ యువ హీరోయిన్ జరీనా ఖాన్ ఎప్పుడూ వివాదాస్పద అంశాలతో మీడియాలో హైలెట్ అవుతుంటారు. ఇటీవల ఓ చిత్రంలో స్వలింగ సంపర్కురాలిగా నటించి సంచలనం రేపిన ఈ బ్యూటీ మరో హాట్ రోల్‌లో కనిపించేందుకు సిద్ధమయ్యారు. ఆ సినిమా విషయాలను వెల్లడిస్తూ..

నన్ను అలాంటి పాత్రలో చూడటానికి
కొన్ని పాత్రల్లో నన్ను చూడటానికి కొందరికి చాలా అనుమానాలు ఉంటాయి. గ్లామర్‌కు దూరంగా ఉండే పాత్రల్లో చూడటానికి ఇష్టపడరు. అయితే ప్రతీసారి నేను విభిన్నమైన పాత్రల్లో నటిస్తే అనేక సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. కానీ నా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత నా ప్రతిభను ప్రశంసిస్తూ, నా పాత్రను మెచ్చుకోవడం తెలిసిందే అని జరీన్ ఖాన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

స్వలింగ సంపర్కురాలిగా
ప్రస్తుతం నేను లెస్పియన్‌గా వెండితెరపై తొలిసారి కనిపించబోతున్నాను. నాకు ఆ పాత్రలో నటించడానికి ఎలాంటి సందేహాలు, అనుమానాలు లేవు. ఆ పాత్ర కోసం నన్ను ఆడిషన్‌కు పిలిచారు. అందుకు నాకు చాలా సంతోషం వేసింది. ఆ పాత్రకు ఎలా న్యాయం చేస్తాననే విషయాన్ని పరీక్షించేందుకు సిద్దమయ్యారు. నా ఆడిషన్ తర్వాత నా టాలెంట్‌ను మెచ్చుకొని నాకు ఆఫర్ ఇచ్చారు అని జరీన్ ఖాన్ అన్నారు.

అలాంటి పాత్రలో నటించడం కష్టం
స్వలింగ సంపర్కురాలి పాత్రలో నటించడం చాలా కష్టమైన విషయమే. ఎందుకంటే నా జీవితంలో చాలా భాగం మగరాయుడిగా బతికాను. ప్రస్తుతం లెస్బియన్ పాత్ర పోషించడానికి నేను నా బాడీ లాగ్వేంజ్‌ను మార్చుకొంటున్నాను. ఈ పాత్ర ద్వారా మహిళా లక్షణాలను అలవాటు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది అని జరీన్ ఖాన్ తెలిపారు.

నేను హోమో సెక్సువల్ కాదు..
లెస్పియన్ పాత్రలో నిజమైన ప్రేమను పడించడానికి సిద్ధమవుతున్నాను. నేను హోమో సెక్సువల్ కాను. స్క్రీన్ మీద సహజంగా, నిజాయితీగా నటించడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ పాత్రలో నటిస్తే ఎల్జీబీటీ కమ్యూనిటీకి ఆగ్రహం కలుగవచ్చు అని జరీన్ ఖాన్ పేర్కొన్నారు.
Recommended Video

జరీన్ ఖాన్ కెరీర్ ఇలా..
ఇక జరీనా ఖాన్ విషయానికి వస్తే.. 2010లో సల్మాన్ ఖాన్‌తో కలిసి వీర్ అనే చిత్రంలో నటించడం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత రెడీ, హౌజ్‌ఫుల్ 2, హేట్ స్టోరీ 3, వీరప్పన్, 1921, చాణక్య చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె నటించిన హమ్ బీ అకేలే తుమ్ బీ అకేలే చిత్రం డీస్నీ+హాట్ స్టార్‌లో రిలీజ్ అయింది.


Click it and Unblock the Notifications











