‘17 ఏళ్ల వయసులో.. మలైకాతో పిల్లల్ని కనాలనే కోరిక కలిగింది’

బాలీవుడ్‌లో వయసు పైబడినా గానీ వన్నె తరగని అందంతో మీడియాను, సోషల్ మీడియానే కాకుండా సెలబ్రిటీలను తన చుట్టూ తిప్పుకొనే అందాల తార మలైకా అరోరా. వైవాహిక జీవితం భగ్నమైనా, డేటింగ్ చేసిన ప్రియుడు దూరమైనా.. ఏ మాత్రం తన దిల్ మీదకు తీసుకోకుండా తనదైన శైలిలో తన లైఫ్‌ను లార్చర్ ద్యాన్ లైఫ్‌గా జీవిస్తూ హడావిడి చేస్తుంటారు. ఎవరెన్నీ గాసిప్స్ ప్రచారం చేసినా.. ఇతరులు ఎన్ని రూమర్లు క్రియేట్ చేసినా తనకు ఏ మాత్రం పట్టింపులేదనే విధంగా బిహేవ్ చేస్తుండమే కాకుండా చాలా డేరింగ్‌గా కనిపిస్తారు. అలాంటి బ్యూటీతో ప్రేమలో పడని వారు ఎవరుంటారు. ఆమెకు 15 ఏళ్ల వయసులో ఓ కుర్రాడు.. ఆ తర్వాత బాలీవుడ్ హీరో ప్రపోజ్ చేసిన తీరును ప్రముఖ ఛానెల్ జూమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మలైకాను చూసి క్రష్‌ పెంచుకొన్నదెవరు? మలైకా లైఫ్ జర్నీ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

అర్బాజ్ ఖాన్‌తో డైవోర్స్.. అర్జున్ కపూర్‌తో బ్రేకప్
దల్ సే సినిమాతో ఛయ్యా ఛయ్యా అంటూ దేశవ్యాప్తంగా స్పెషల్ సాంగ్‌తో కేక పుట్టించిన మలైకా అరోరా కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. సల్మాన్ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ను వివాహం చేసుకొన్నారు. 1998 సంవత్సరంలో వివాహం చేసుకొని 2017లో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత బోని కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో రెండేళ్లకుపైగా డేటింగ్ చేసింది. ఆ తర్వాత వారిద్దరూ బ్రేకప్ చెప్పుకొన్నారు. ప్రస్తుతం తనకంటే వయసులో చాలా తక్కువగా ఉన్న వ్యాపారవేత్త సోరబ్ బేడితో సన్నిహితంగా ఉంటూ కనిపిస్తున్నారు.

Zayed Khan crush on Malaika Arora

యుక్త వయసులో మలైకా అరోరా
అయితే మలైకా అరోరా యుక్త వయసులో ఉన్న సమయంలోనే బాలీవుడ్ నిర్మాత సంజయ్ ఖాన్ కుమారుడు జాయేద్ ఖాన్‌ మనసు పడ్డారట. ఆ విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆమెతో ఉన్న అనుబంధం, క్రష్, ఫ్రెండిషిష్ తదితర విషయాలను వెల్లడించారు.

మలైకా అరోరా డేరింగ్ చూసి
మలైకాతో క్రష్ గురించి బాలీవుడ్ నటుడు జాయేద్ ఖాన్ వెల్లడిస్తూ.. మలైకా అరోరాకు 15 ఏళ్లు.. నాకు 17 ఏళ్లు ఉన్నప్పుడు ఆమెను చూశాను. ఆమె అందానికి ముగ్దుడనై అలాగే చూస్తుండిపోయాను. అప్పుడు నీవు చేస్తున్నావు అని ప్రశ్నించింది. అప్పుడే నాకు మా నాన్న నుంచి ఫోన్ వచ్చింది. నేను మా నాన్నతో ఒక్క నిమిషం ఫోన్‌లో మాట్లాడి వస్తాను. అప్పటి దాక వెయిట్ చేయి అంటే.. నీకు మీ ఫాదర్ కావొచ్చు. ఇక్కడ నీ సమాధానం కోసం వెయిట్ చేసే నేను. మీ ఫాదర్‌తో నాకు లెక్కేలేదు అనే విధంగా మాట్లాడింది. మలైకా మాటలకు నేను ఒక్క నిమిషం షాక్ గురయ్యాను. క్యా బాత్ హై.. ఆమె డేర్, డాషింగ్ బిహేవియన్ చూసి ఆశ్చర్యపోయాను. నీ లాంటి దానితో నేను పిల్లల్ని కనాలని అనుకొన్నాను అంటూ జాయేద్ ఖాన్ చెప్పాడు.

15 వయసులోనే డేటింగ్
ఆ తర్వాత వెంటనే నేను నా పక్కనే ఉన్న ఫ్రెండ్‌ను ఎవరు ఈవిడ అని అడిగితే.. మలైకా అరోరా అంటూ ఆమె వివరాలు చెప్పారు. అయితే మరుక్షణమే.. ఆమె వేరే అబ్బాయితో డేటింగ్‌లో ఉంది అంటూ బాంబు పేల్చాడు. అయితే ఆమె ఎవరితో డేటింగ్ చేస్తున్నదనే విషయం నాకు ముఖ్యం కాదు. ఆమె నన్ను ప్రేమిస్తుందా? లేదా అనేది అప్రస్తుతం. నేను ఫోన్‌లో మాట్లాడిన తర్వాత మరోసారి నాకు హలో చెప్పింది. అలా ఆమెతో పరిచయం మొదలైంది. ఆమెను చూసి రెండుసార్లు ప్రేమలో పడ్డాను అని జూమ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకాతో ఉన్న క్రష్‌ను తెలిపాడు.

Zayed Khan crush on Malaika Arora

జాయెద్ ఖాన్ ఎవరు?
జాయెద్ ఖాన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలకు వస్తే.. ప్రముఖ నిర్మాత సంజయ్ ఖాన్‌ కుమారుడు. హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే ఖాన్‌కు స్వయానా సోదరుడు. హిందీ పరిశ్రమలోకి చురా లియా హై తుమ్నే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత షారుక్ ఖాన్‌తో మై హూనా సినిమాలో నటించాడు. ఆ తర్వాత వాదా, ఓం శాంతి ఓం, యువరాజ్, తేజ్ లాంటి సినిమాల్లో నటించారు. నిర్మాతగా కూడా కొన్ని ప్రాజెక్టులు చేశాడు.

Read more about: zayed khan malaika arora
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X