ఇది ఫిల్మ్ కాదు.. ఫీలింగ్: ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే సాంగులో, ఫ్యాన్స్‌కి పండగే!
Recommended Video

భారీ ఫ్యాన్ ఫోలోయింగ్ ఉన్న ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? మామూలు ప్రేక్షకులు ఏమోకానీ... అభిమానులకైతే కన్నుల పండగలా ఉంటుంది. త్వరలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ అభిమానులు ఇలాంటి ఫీలింగే పొందబోతున్నారు.
షారుక్ ఖాన్ హీరోగా ఆనంద్ ఎల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'జీరో' చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఓ పాటలో అభిమానులకు కనువిందు చేయబోతున్నారు. తాజాగా ఈ పాటకు సంబంధించి టీజర్ విడుదల చేశారు.
అద్భుతమైన రెస్పాన్స్
‘జీరో' చిత్రంలో షారుక్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇసక్‌బాజి పాటలో.... సల్మాన్ ఖాన్ చంక ఎక్కి షారుక్ కనిపించడం, మరుగుజ్జు పాత్రలో అతడితో కలిసి డాన్స్ చేయడం ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
దోస్త్ కోసం చేశానన్న సల్మాన్
దోస్త్ కోసమే నేను ఈ సినిమాలో నటించాను అంటూ ఈ సాంగ్ వీడియోను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
ఇది ఫిల్మ్ కాదు.. ఫీలింగ్
డిసెంబర్ 21న రాబోతున్న ‘జీరో'ను ఫిల్మ్ కాదు.. ఫీలింగ్ అంటూ అభిమానుల మనసులో ఉన్న ఫీలింగును రిఫ్లెక్ట్ చేసేలా రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్ సంస్థ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది.

అభిమానుల్లో భారీ అంచనాలు
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇందులో అనుష్క శర్మ వికలాంగురాలిగా నటించగా, కత్రినా కైఫ్ గ్లామర్ డాల్‌గా అభిమానులను ఎంటర్టెన్ చేయనుంది. ఈ సినిమా ప్రేక్షకులను కొన్ని సందర్భాల్లో నవ్విస్తుంది, మరికొన్ని సందర్భాల్లో ఏడిపిస్తుంది, మరికొన్ని సందర్భాల్లో ఆశ్చర్య పరిచే విధంగా అన్ని అంశాలు కలగలిపి ఉండబోతోంది.

శ్రీదేవి స్పెషల్ అప్పియరెన్స్ కూడా
ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రతో పాటు లేట్ లెజెండ్ శ్రీదేవి, రాణి ముఖర్జీ, కాజోల్, అలియా భట్, అభయ్ డియోల్, ఆర్ మాధవన్, దీపిక పదుకోన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. శ్రీదేవి చనిపోక ముందే ఆమెకు సంబంధించిన సీన్లు చిత్రీకరించారట.


Click it and Unblock the Notifications











