twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన సినిమాల్లో సెక్స్‌ తప్పుగా చూపిస్తూ వచ్చారు: మహిళ డైరెక్టర్ ఆవేదన

    |

    మన హిందీ సినిమాల్లో సెక్స్ అనే అంశాన్ని మొదటి నుంచి తప్పుడు అంశంగా ఫోకస్ చేస్తూ వచ్చారని, చాలా సినిమాల్లో చూపించే సీన్లలో ఎక్కువగా ఫిజికల్ అబ్యూస్, రేప్, వేధింపుల కోణంలో సెక్స్ ఫోకస్ చేశారని, యంగ్ ఏజ్‌ పీపుల్ అలాంటి సీన్లు చూసినపుడు వాటి ప్రభావం కూడా అలానే ఉంటుంది. వాస్తవానికి ఇద్దరి మధ్య ఏకాభిప్రాయంతో జరిగే సెన్సువల్ సెక్స్ విభిన్నమైనది అంటున్నారు ప్రముఖ బాలీవుడ్ లేడీ ఫిల్మ్ మేకర్, గల్లీ బాయ్ దర్శకురాలు జోయా అక్తర్.

    ఆ హీరో భార్య అమ్మాయిలను సప్లై చేస్తుంది, కేకలు వేస్తున్నా వదలడు.. 'మా' ఎన్నికల వేళ శ్రీరెడ్డి బాంబ్! ఆ హీరో భార్య అమ్మాయిలను సప్లై చేస్తుంది, కేకలు వేస్తున్నా వదలడు.. 'మా' ఎన్నికల వేళ శ్రీరెడ్డి బాంబ్!

    సినిమాల్లో అంతా అదే..

    సినిమాల్లో అంతా అదే..

    ‘నేను చిన్నతనం నుంచి యంగ్ ఏజ్‌లోకి వచ్చే క్రమంలో హిందీ సినిమాలు చూసినపుడు అందులో కేవలం ఫిజికల్ అబ్యూస్ మాత్రమే కనిపించేది. రేప్ సీన్లు, వేధింపులు, దాడికి సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి. అందరూ దాన్నే ఫాలో అవుతూ వచ్చారు. ఇద్దరి ఏకాభిప్రాయంతో జరిగే సెక్స్ మన సమాజం అంగీకరించినట్లు ఎక్కడా ఉండదు' అని జోయా అక్తర్ తెలిపారు.

    అందువల్లే తప్పుడు సంకేతాలు

    అందువల్లే తప్పుడు సంకేతాలు

    సినిమాల్లో అలాంటి సీన్లు చూస్తూ వచ్చిన మనం సెక్స్ మీద తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకున్నాం. అదొక తప్పుడు పని అనే అభిప్రాయం చాలా మందిలో ఏర్పడింది. ఇద్దరు వ్యక్తులు ముద్దు పెట్టుకోవడాన్ని కూడా సహించలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలా మన సినిమాల్లో సెక్స్‌ను సమస్యాత్మకంగా చూపించడం వల్లే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి అని జోయా అక్తర్ అభిప్రాయ పడ్డారు.

    అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది.

    అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది.

    నేను చిన్నతనం నుంచి హార్డ్ కోర్ ఫెమినిస్టుగా పెరిగాను. నా పురుష స్నేహితులు, సినిమా ఇండస్ట్రీలోని నా సహచరులు, బయటి వ్యక్తులు చాలా మంది ఫెమినిస్టులే. కానీ ఈ సమాజంలోని పరిస్థితులను అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది అని జోయా అక్తర్ తెలిపారు.

    జోయా అక్తర్

    జోయా అక్తర్


    ప్రముఖ బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్, నటి హనీ ఇరానీ కుమార్తె అయిన... జోయా అక్తర్ ఇటీవల రణవీర్-అలియా భట్ జంటగా రూపొందించిన ‘గల్లీ బాయ్'తో సూపర్ హిట్ అందుకున్నారు. ఇంతకు ముందు ఆమె లస్ట్ స్టోరీస్, మేడ్ ఇన్ హెవెన్ లాంటి వెబ్ సిరీస్‌లతో పాటు బాంబే టాకీస్, దిల్ దడఖ్నేదో లాంటి చిత్రాలను రూపొందించారు.

    English summary
    Filmmaker Zoya Akhtar says portrayal of sex in Hindi cinema has been problematic with more focus on physical abuse, rape and molestation than consensual sex. Zoya said when people consume such content at a young age, the impact is visible later. "I realised this much later that while I was growing up, I have only seen physical abuse in Hindi films. It was crazy because we were allowed to watch rape scenes, molestation and assault but we weren't allowed to see consensual sex,'' Gully Boy director told PTI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X