twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ '1' (నేనొక్కడినే) ఆడియో ట్రాక్ లిస్ట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : భారీ వ్యయంతో రూపొందుతున్నమహేష్‌బాబు చిత్రం '1' (నేనొక్కడినే) . ఈ చిత్రం ఆడియో చాలా విభిన్నంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో డిసెంబర్ 19న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో రైట్స్ ని లహరి ఆడియో సంస్ధ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో సరసన కృతిసనన్‌ నటిస్తోంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపి ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

    ఈ చిత్రం ఆడియో ట్రాక్ లిస్టు ఇదే...

    1. హూ ఆర్ యు

    2. యు ఆర్ మై లవ్

    3. లండన్ బాబు

    4. ఆవ్ తుజో మొఘ్ కోర్తా

    5. ఓ సయోనర సయోనర

    1-Nenokkadine Audio Track List

    14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకుడు. గోవా షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే. అక్కడే షూటింగ్ పూర్తికావటంతో గుమ్మిడికాయ కొడతారని సమాచారం. ఇక డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 'జనవరి 10న '1'ని తెచ్చేస్తున్నాం' అని మహేష్‌ కూడా చెప్పేశాడు. మహేష్‌కి సంక్రాంతి సీజన్‌ బాగా కలిసొచ్చింది 'ఒక్కడు', 'బిజినెస్‌మేన్‌', 'సీతమ్మ వాకిట్లో' ముగ్గుల పండక్కి విడుదలై విజయాన్ని సాధించాయి. ఇప్పుడు '1' కూడా పండగ బరిలో దిగబోతోంది.

    అలాగే ఈ చిత్రంలో కృతిసనన్‌ ఓ టీవీలో న్యూస్‌ రీడర్‌గా పని చేస్తోంది. ఇందుకోసం ఆమె ఏవో వార్తలు చదువటాన్ని మొన్నా మధ్య రామోజీఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూట్ చేసారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇక్కడ అందుకు సంబంధించిన సీన్లతో పాటు యాక్షన్ సీన్లు, చేజింగ్ సీన్లు చిత్రీకరించారు.

    డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

    English summary
    Mahesh Babu much excited film “1- Nenokkadine” audio release, audio launch will be held at Shilpakala Vedika in Hyderabad on 19th of this month. Bollywood model Kriti Sanon is doing onscreen romance with Mahesh Babu in this suspense action thriller. Devi Sri Prasad has scored the music of the film. Sukumar wields the megaphone. The movie has been produced by Anil Sunkara, Ram Achanta and Gopichand Achanta on 14 Reels Entertainment banner. Here is the audio track list exclusive for our readers before audio release..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X