'1 నేనొక్కడినే' కలెక్షన్స్ పరిస్ధితి
హైదరాబాద్ : మహేష్ ఈసారి '1, నేనొక్కడినే' అంటూ సంక్రాంతి సంబరాలు చేయటానికి వచ్చాడు. జనవరి 10 న విడుదల అయిన ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా కథ,కథనాలు చాలా క్లిష్టంగా ఉన్నాయని టాక్ వ్యాపించంటతో దాని ప్రభావం కలెక్షన్స్ పై పడింది.
రిలీజ్ రోజు ఓ రేంజిలో ఓపినింగ్స్ రాబట్టుకున్నా రెండో రోజు నుంచే బాగా డ్రాప్ అవటం మొదలెట్టాయని ట్రేడ్ టాక్. అప్పటికీ సుకుమార్...ట్రైలర్స్ మార్చి ఇంటర్వూలతో సినిమాని ప్రమోట్ చేస్తున్నా పెద్దగా ఫలితం కనపడటం లేదని వాపోతున్నారు. ఇదే డ్రాప్ కంటిన్యూ అయితే వారాంతానికి భారీ మొత్తాలతో కొనుక్కున్న వారి పరిస్ధితి ఊహించటం కష్టం అంటున్నారు.

'1, నేనొక్కడినే' కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో దాదాపు 1450థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఈ సినిమాని దాదాపు 1200 థియేటర్లలో రిలీజ్ చేసారు. ఓవర్సీస్‌లో 250థియే టర్లలో రిలీజ్ అయిన చిత్రమిదే. ఏ ఇతర సినిమాతో పోల్చినా ఇదో రికార్డ్. ఇంతవరకూ సుమారు వెయ్యి థియేటర్లలో మాత్రమే సినిమాలు రిలీజయ్యేవి. వన్ ఆ రికార్డులను తుడిచేసింది.
రిలీజైన తొలివారంలోనే సినిమాకి ఖర్చు చేసిన రూ.72కోట్లను లాగేయాలనేది నిర్మాతల ఆలోచన. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజవుతుండడం ఇంకో రికార్డ్. ముఖ్యంగా కొరియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, జపాన్, రష్యా తదితర చోట్ల అక్కడి స్థానిక భాషల్లో రిలీజవుతుండడం పెద్ద సెన్సేషన్. ఆయా ప్రాంతీయ భాషల్లో సబ్ టైటిల్స్‌తో సినిమా వేయనున్నామని నిర్మాతలు తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని లండన్, ఉత్తర అమెరికా పరిసరాలు సహా జపాన్‌లోనూ చిత్రీకరించారు. బ్యానరు: 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్.


Click it and Unblock the Notifications











