1 Nenokkadine 4K Box Office: 1 నేనొక్కడినే 4K బాక్సాఫీస్ కలెక్షన్స్.. మహేష్ మూవీ రీ రిలీజ్ వసూళ్లు ఎంతంటే?

సూపర్‌స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 1 నేనొక్కడినే. ఈ చిత్రం ద్వారా కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మించారు. ఈ సినిమాను ఎరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ చిత్రంలో నాజర్, ప్రదీప్ రావత్, సాయాజీ షిండే, కెల్లీ దోర్జి, పోసాని కృష్ణ మురళీ, శ్రీనివాసరెడ్డి, ఆనంద్, జాన్ కొక్కేన్ తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. స్క్రీన్ ప్లేను జెరిమీ జిమ్మర్‌మ్యాన్, డైలాగ్స్: అర్జున్ వైకే, తోట శ్రీనివాస్, సినిమాటోగ్రఫి: ఆర్ రత్నవేలు, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా 2014 జనవరి 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. అయితే సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ మూవీని మరోసారి మే 31వ తేదీన రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? థియేట్రికల్ రన్‌లో ఎంత వసూలు చేసింది? ప్రస్తుతం రీ రిలీజ్ సందర్భంగా నమోదైన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

1 Nenokkadine Re Release box office

రాక్‌స్టార్ గౌతమ్ (మహేష్ బాబు) ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు. చిన్నతనంలో తన తల్లిదండ్రులను ముగ్గురు హత్య చేసిన దుర్ఘటన తనను వెంటాడుతుంటుంది. అయితే వారు ఎవరో గుర్తుపట్టని పరిస్థితి. గోవాలో మ్యూజిక్ కాన్సర్ట్‌లో తన తల్లిదండడ్రులను చంపిన వారిని గుర్తు పట్టి వెంటాడుతాడు. ఆ కాన్సర్ట్‌కు వచ్చిన జర్నలిస్ట్ సమీరా (కృతిసనన్) పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే ఆ ముగ్గురు ఎవరు? వారు ఎందుకు గౌతమ్ తల్లిదండ్రులను చంపారు? తన పేరెంట్స్‌ను చంపిన వారిని గౌతమ్ ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

ఎమోషనల్ కంటెంట్, మహేష్ బాబు పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్లే, టేకింగ్ అంశాలు సగటు ప్రేక్షకుడిని మెప్పించినప్పటికీ.. కథ చెప్పడంలో ఏర్పడిన గందరగోళం కారణంగా ఆడియెన్స్ సినిమాకు డిటాచ్ అయ్యారనే అభిప్రాయం అందరిలో వినిపించింది. టెక్నికల్‌గానే కాకుండా కంటెంట్ పరంగా రిచ్‌తో ఈ సినిమాను సుమారుగా 70 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగ 45 కోట్ల రూపాయల గ్రాస్, 30 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా మహేష్ కెరీర్‌లో మరో ఫ్లాప్ సినిమాగా మారినప్పటికీ.. పెర్ఫార్మెన్స్, మ్యూజిక్ పరంగా ఇప్పటికీ ఈ తరం ప్రేక్షకులను మెప్పించేలా చేస్తున్నది.

మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు ట్రిబ్యూట్‌గా ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం రీ రిలీజ్‌కు మొదటి రోజు భారీగానే స్పందన లభించింది. ఈ చిత్రాన్ని మే 30 తేదీన బెంగళూరులో ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ సినిమాకు 400 టికెట్లు అమ్ముడుపోగా 50 వేల రూపాయల కలెక్షన్లు సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను మే 31వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. తెలంగాణలో 110 షోలు, ఆంధ్రాలో 230 షోలు, బెంగళూరులో 20 షోలకు ఏర్పాటు చేశారు. ఈ సినిమా కోసం 55 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్‌లోనే తొలి రోజు 5 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ చిత్రం తాజా వివరాలు అందేసరికి 70 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇంకా ఫస్ట్, సెకండ్ షోలకు అభిమానుల తాకిడి ఎక్కువైతే భారీగా కలెక్షన్లు ఉండే అవకాశం ఉంది అని సినీ ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X