Box Office Report: 1000 కోట్ల వసూళ్లు ఒక్క నెలలోనే.. బాక్సాఫీస్ వద్ద ఆ స్టార్ హీరోల ఫైర్

ఈ 2024 ఏడాదిలోనే దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో కూడా భారీ వసూళ్లు కొల్లగొట్టిన పలు హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాలు వచ్చాయి. అయితే సౌత్ నుంచి సహా టోటల్ ఇండియన్ సినిమా దగ్గరే ఈ ఏడాదికి ప్రస్తుతానికి బిగ్గెస్ట్ గ్రాసర్ గా మన టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన "కల్కి 2898 ఎడి" మొదటి ప్లేస్ లో నిలిచింది. కాగా ఈ సినిమా సహా చాలా సినిమాలు తెలుగు నుంచి భారీ వసూళ్లతో రాణించాయి.

ఇక ఇవి సహా హిందీ సినిమాలో 'స్త్రీ 2' అనే ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా అయితే రికార్డు వసూళ్లు కొల్లగొట్టి ఏకంగా 800 కోట్లకి పైగా అది కూడా ఒక్క హిందీ భాషలోనే విడుదల అయ్యి ఈ రేంజ్ వసూళ్లు సాధించింది. ఇలా తెలుగు సహా హిందీ మార్కెట్ లు భారీ వసూళ్లతో దుమ్ము లేపాయి. కానీ సౌత్ నుంచి ఇతర ఇండస్ట్రీ లలో చూస్తే ఏడాది స్టార్టింగ్ లోనే సెన్సేషనల్ వసూళ్లతో మలయాళ సినిమా సినిమా ఓ రేంజ్ లో షైన్ అయ్యింది.

1000 crore boxoffice collection single month with 2 movies from south

కాగా ఫిబ్రవరి నుంచి కొన్ని నెలలు వరుస 100 కోట్లు 200 కోట్లకి పైగా గ్రాసర్ లతో దుమ్ము లేపాయి. కానీ కన్నడ, తమిళ్ సినిమాలు మాత్రం ఏడాది సగం పూర్తయ్యేవరకు మాత్రం పెద్దగా మంచి వసూళ్లు అందుకున్న సినిమాలు అందించలేదు. కాగా కన్నడ సినిమా అయితే ఇంకా ఖాతా తెరవలేదు కానీ ఈ ఏడాదికి కోలీవుడ్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ ని దళపతి విజయ్ నటించిన "ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం" తో కొట్టాడు.

అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా వచ్చిన నెల లోనే వచ్చిన మరో సినిమాతో ఒక్క సెప్టెంబర్ లో వచ్చిన సినిమాలు ఏకంగా 1000 కోట్ల టర్నోవర్ బాక్సాఫీస్ దగ్గర చూపించాయి. కాగా విజయ్ సినిమా ఏకంగా 460 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ అయ్యింది. అయితే ఇదే సెప్టెంబర్ లో వచ్చిన మరో సినిమా ఏకంగా 500 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని రెండు కలిపి 1000 కోట్ల మేర వసూళ్లు అందుకునేలా మారింది.

1000 crore boxoffice collection single month with 2 movies from south

కాగా ఆ రెండో సినిమానే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన భారీ చిత్రం "దేవర" మరి ఈ సినిమా కూడా సెప్టెంబర్ లోనే వచ్చి 500 కోట్లకి పైగా గ్రాస్ ని ఎప్పుడో క్రాస్ చేసింది. మరి లాంగ్ రన్ లో ఈజీగా 550 కోట్లకి పైగానే ఈ సినిమా అందుకునే ఛాన్స్ ఉంది. ఇలా మేజర్ గా వచ్చిన సెప్టెంబర్ సినిమాల్లో కేవలం ఈ రెండు సినిమాల నుంచే ఏకంగా 1000 కోట్ల మేర వసూళ్లు బాక్సాఫీస్ దగ్గర వచ్చేసాయి. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు సినిమాలకి కూడా సూపర్ పాజిటివ్ టాక్ ఎక్కడా రాలేదు. అయినప్పటికీ అదే మిక్స్డ్ టాక్ తోనే ఈ భారీ స్థాయి వసూళ్లు అందుకోవడం విశేషం.

More from Filmibeat

Read more about: jr ntr devara thalapathy vijay
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X