ట్రేడ్‌టాక్‌: మంచి చిత్రాలకే ఆదరణ

By Staff

ఆగస్టు నెల ప్రథమార్ధంలో విడుదలైన డజనుపైగా చిత్రాలలో తాజాగా విడుదలైన బొమ్మరిల్లు తప్ప మిగతా ఏ చిత్రమూ జనాదరణకు నోచుకోలేకపోయింది.

నెల మొదట్లోనే (4న) మోహన్‌బాబు సొంత సంస్థ శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై విడుదల చేసిన గేమ్‌ చిత్రం ఫర్వాలేదు అనిపించింది కానీ కలెక్షన్లు రాబట్టుకోవడంలో విఫలమవుతోంది. హిందీలో వచ్చిన టాక్సీ నెం. 9211 రీమేక్‌ అయిన గేమ్‌ చిత్రంలో మోహన్‌బాబు ముందు విష్ణు తేలిపోయాడని, హిందీ చిత్రంలో టేకింగ్‌, మిగతా టెక్నికల్‌ అంశాలలో కనిపించిన క్లాస్‌ తెలుగు సినిమాలో లోపించిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫలితంగా ఈ సినిమా అటు మాస్‌ ప్రేక్షకులకూ, ఇటు క్లాస్‌ ప్రేక్షకులకూ చేరువకాలేకపోయిందన్న మాట వినిపిస్తోంది. అయితే, ఈ చిత్రానికి బ్యాడ్‌ టాక్‌ లేకపోవడంతో క్రమంగా పుంజుకునే అవకాశాలున్నాయి. ప్రేక్షకులలో నటునిగా మెప్పించే చిత్రం ఒక్కటి కూడా చేయకుండానే పెద్ద హీరో అయిపోదామని విష్ణు పడుతున్న తాపత్రయంపై విమర్శలు వస్తున్నాయి. చిన్న చిత్రాలతో తనొక నటుడినని నిరూపించుకున్నాక అతను ఎటువంటి వేషాలు వేసినా జనం చూస్తారనేది వారి అభిప్రాయం. హిందీలో సర్ఫరోష్‌ చిత్రంలో అమీర్‌ ఖాన్‌ పాత్రను, ఆ తర్వాత జాన్‌ అబ్రహమ్‌ చేసిన పాత్రను ఎంచుకుని మెప్పించలేక చతికిలపడిన అతను ముందు బేసిక్స్‌ మీద పట్టుసాధించాలన్నది సినీవర్గాల సూచన.

ఇక మిగతా సినిమాల విషయానికొస్తే.. ఉషాకిరణ్‌ మూవీస్‌ వారు చాలాకాలం తర్వాత రూపొందించిన వీధి (ది స్ట్రీట్‌) చిత్రం ఊహించినట్టే ఘోరంగా బోల్తా కొట్టింది. ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, సన్నివేశాలు, పాత్రోచిత నటన, సంగీతం.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్లలోనూ నాణ్యత లేక ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. రాజు వూపాటి పేరుతో ధమ్‌ అనే పెద్ద ఫ్లాప్‌ సినిమా తీసిన దర్శకుడు అదే స్టాండర్డ్‌లో ఇంకో పెద్ద ఫ్లాప్‌ ఇచ్చాడు.

ఆగస్టు 4నే విడుదలైన గుణ్ణం గంగరాజు చిత్రం అమ్మ చెప్పింది మంచి చిత్రంగా పేరు సంపాదించినా సెంటిమెంట్‌ పాళ్లు ఎక్కువయ్యేసరికి కలెక్షన్లు మందగించింది. ఈ సినిమా క్రమంగా మహిళా ప్రేక్షకులకు సినిమా ఎక్కుతుందన్న ఆశ సినిమా రూపకర్తలకు ఉంది. అందుకే వారు టీవీ ఛానెల్స్‌లో ఈ సినిమా ప్రమోషన్‌ను ఊదరగొడుతున్నారు. అయితే, గంగరాజు నిర్మాతగా తీసిన అనుకోకుండా ఒక రోజు.. చిత్రానికి ఉన్న టాక్‌ అమ్మ చెప్పింది చిత్రానికి మాత్రం రాలేదు. ఎలా చూసినా ఇది కలెక్షన్ల పరంగా బిలో యావరేజ్‌ చిత్రంగా మిగలవచ్చు.

పోకిరి ఇప్పటికీ స్టడీగా కలెక్షన్లు సాధిస్తుండగా పందెంకోడి చిత్రం వందరోజులకు పరుగులు పెడుతోంది. అశోక్‌ చిత్రం 50 రోజులు మార్క్‌ దాటడానికి అవస్థలు పడుతోంది.

తాజాగా విడుదలైన చిత్రాలలో బొమ్మరిల్లు (9న) మొదటి షో నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X