‘118’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్.. కళ్యాణ్ రామ్, దిల్ రాజు సూపర్ హ్యాపీ!
Recommended Video

నందమూరి కళ్యాణ్ రామ్ మొహంలో చాలా రోజుల తర్వాత ఆనందం కనిపిస్తోంది. 'పటాస్' తర్వాత సరైన హిట్టులేక కొట్టుమిట్టాడుతున్న ఈ స్టార్ తాజాగా '118' సినిమాతో ఎట్టకేలకు విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి.గుహన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది.
ఆదివారంతో ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో దాదాపు 65శాతం రీకవరీ అయింది. కేవలం 3 రోజుల్లోనే ఈ స్థాయిలో వసూలు కావడంపై ట్రేడ్ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

3 డేస్ కలెక్షన్
మూవీ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి 3 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 4 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాగా... శని, ఆదివారాల్లో సంతృప్తికరమైన బిజనెస్ చేసింది.

సినిమా ఎంతకు కొన్నారు
ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూ. 6 కోట్లకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుగోలు చేశారు. 65 శాతం రికవరీతో ఫస్ట్ వీకెండ్ సినిమా అద్భుతమైన బిజినెస్ చేయడంతో ఆయన సూపర్ హ్యపీగా ఉన్నారు.

ఏరియా వైజ్ 3 డేస్ షేర్
నైజాం: రూ. 1.68 కోట్లు, సీడెడ్ రూ. 64 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 47 లక్షలు, గుంటూరు రూ. 36, ఈస్ట్ గోదావరి రూ. 21 లక్షలు, వెస్ట్ గోదావరి 18 లక్షలు, కృష్ణ రూ. 33 లక్షలు, నెల్లూరు రూ. 11 లక్షలు వసూలు చేసింది.

నిర్మాత మాట్లాడుతూ...
నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ... 118 మంచి రెవిన్యూ దూసుకెళుతోంది. ఈ సినిమాకు మాకు ఫస్ట్ ధైర్యాన్ని ఇచ్చిన తారక్‌కి థాంక్స్. ఆ తరువాత అంతటి ధైర్యాన్ని దిల్ రాజు, శిరీష్ ఇచ్చారు. వారి నమ్మకం నిజమైంది. ఈ శివరాత్రికి మీరందరు కుటుంబసమేతంగా వెళ్ళి సినిమా చూడాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











