బాక్సాఫీస్ రిపోర్ట్: నందమూరి కళ్యాణ్ రామ్ ‘118’ కలెక్షన్ల పరిస్థితి ఇదీ!
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ '118'. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా ద్వారా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ కొనేరు నిర్మించగా మార్చి 1న విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
కళ్యాణ్ రామ్ సినిమాల మార్కెట్‌తో పోలిస్తే 118 చిత్రం డిసెంట్ కలెక్షన్లతో మొదలైంది. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుండటంతో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు పుంజుకునే అవకాశం ఉంది. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ ఆల్రెడీ సంబరాల్లో మునిగిపోయింది.

తొలి రోజు ఎంత వసూలైంది?
బాక్సాఫీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం నైజాం, ఆంధ్రప్రదేశ్ రెండు ఏరియాల్లో కలిపి రూ. 1.40 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఇమేజ్‌తో పోలిస్తే ఇది డీసెంట్ స్టార్ట్‌గా ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఎంతకు కొన్నారు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘118' మూవీని కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఆయన ప్రింట్, పబ్లిసిటీతో కలిపి రూ. 6 కోట్లకు కొన్నారట. ఓపెనింగ్స్ డిసెంటుగా ఉండటంతో లాభాలు రావడం ఖాయమని తేలిపోయింది.

ఏరియా వైజ్
ఏరియా వైజ్ నైజాంలో రూ. 51 లక్షలు, సీడెడ్లో రూ. 24 లక్షలు, ఉత్తరాంద్రలో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6.5 లక్షలు, కృష్ణలో రూ. 11 లక్షలు, నెల్లూరులో రూ. 3.5 లక్షలు తొలిరోజు షేర్ వసూలైంది.

కళ్యాణ్ రామ్
118 విజయంతో నా జీవితాంతం రుణపడిపోయే ఫీలింగ్ కలిగించారు. మీరు ఈ సినిమాను యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే నేను చాలా బాధపడేవాన్నేమో? ఒక చిన్న గట్ ఫీలింగ్ వచ్చింది. ప్రేక్షకులకు కొత్తగా ఏమైనా ఇస్తే తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు.. వారి గుండెల్లో పెట్టుకుంటారనే ఒక చిన్న నమ్మకం ఏర్పడింది. సినిమాను హిట్ చేసిన అందరికీ చాలా థాంక్స్ అని కళ్యాణ్ రామ్ సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











