‘118’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్... ఈ సినిమా వల్ల లాభామా? నష్టమా?
Recommended Video

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన '118' బాక్సాఫీసు వద్ద విజయవంతంగా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని డీసెంట్ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి తర్వాత టాలీవుడ్లో విడుదలైన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. 118 మాత్రమే విజయాన్ని అందుకుంది.
118 ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగిన విధంగా సినిమా ఉండటంతో పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. ఈ చిత్రానికి పోటీగా అజిత్ మూవీ 'విశ్వాసం', మరికొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలు వచ్చినప్పటికీ '118' థియేట్రికల్ రన్ మీద ఎలాంటి ప్రభావం చూపలేక పోయాయి.

శివరాత్రి కలిసొచ్చింది
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసి విడుదల చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో గుడ్ నెంబరాఫ్ థియేటర్లు దక్కాయి. దీంతో ఈ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్ మంచి వసూళ్లు సాధించింది. ఆ వెంటనే శివరాత్రి హాలిడే కలిసి రావడంతో ఆదివారం తర్వాత కూడా మంచి బిజినెస్ జరిగింది.

ప్రాఫిట్స్ జోన్లోకి...
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.54 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇందులో దాదాపు రూ. 7.50 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైనట్లు తెలుస్తోంది. సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 6.90 కోట్లకు అమ్మారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడంతో ప్రాఫిట్స్ జోన్లోకి వెళ్లారు.

ఈ వారం కూడా...
ఈ వారం తెలుగు సినిమాలు ఏవీ విడుదల కావడం లేదు. హాలీవుడ్ మూవీ ‘కెప్టెన్ మార్వెల్', ‘సర్వం తాళయం' అనే డబ్బింగ్ చిత్రం మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. ఇది ‘118' చిత్రానికి కలిసొచ్చే అంశంగా ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

118
నందమూరి కళ్యాణ్ రామ్, నివేదా థామస్, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా నటించిన స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ '118' ద్వారా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ ఎస్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











