twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘118’ మూవీ బాక్సాఫీస్ లేటెస్ట్ కలెక్షన్స్, లాభం ఎంతంటే..?

    |

    నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన స్టైలిష్‌ యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ '118'. నివేదా థామస్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా ద్వారా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేష్ కొనేరు నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుద‌ల‌ై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

    '118' చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 17 రోజులు పూర్తి చేసుకుంది. సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి రాబట్టడంతో పాటు లాభాలు కురిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా సాధించిన వసూళ్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

    118 మూవీ వరల్డ్ వైడ్ షేర్

    118 మూవీ వరల్డ్ వైడ్ షేర్

    ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 10.02 వరల్డ్ వైడ్ షేర్ సాధించినట్లు సమాచారం. మూవీ రైట్స్ రూ. 6.90 కోట్లకు అమ్మారు. టోటల్ రూ. 10 కోట్ల షేర్ రావడంతో లాభాల బాటలోకి వెళ్లింది.

    తొలివారం తర్వాత తగ్గిన బిజినెస్

    తొలివారం తర్వాత తగ్గిన బిజినెస్

    ఈ చిత్రం తొలి వారమే రూ. 7.39 కోట్ల షేర్ సాధించగా... గడిచిన 10 రోజుల్లో రూ. 2.63 కోట్ల షేర్ వసూలు చేసింది. తొలి వారం తర్వాత బిజినెస్ తగ్గినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లకు ఎంతోకొంత లాభం తెచ్చిపెట్టింది.

    ఏరియా వైజ్

    ఏరియా వైజ్

    నైజాం రూ. 3.84 కోట్లు, సీడెడ్ రూ. 1.20 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.14 కోట్లు, గుంటూరు రూ. 68 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 57 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 45 లక్షలు, కృష్ణ రూ. 76 లక్షలు, నెల్లూరు రూ. 23 లక్షలు, రెస్టాఫ్ ఇండియా రూ. 73 లక్షలు, వర్సీస్ రూ. 42 లక్షల షేర్ వసూలైంది.

    చాలా రోజుల తర్వాత హిట్

    చాలా రోజుల తర్వాత హిట్

    ‘పటాస్' తరక్వాత చాలా రోజుల పాటు కళ్యాణ్ రామ్ హిట్ చూడలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత అతడి ఖాతాలో హిట్ సినిమా పడింది. మరో వైపు కెవి గుహన్ దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకున్నారు. కళ్యాణ్ రామ్‌తో ‘నా నువ్వే' తీసి నష్టపోయిన నిర్మాత మహేష్ ఎస్ కోనేరు ఈ మూవీ హిట్టవ్వడంతో ఆ నష్టాలను కొంతమేర బర్తీ చేసుకున్నాడు.

    English summary
    118 has surpassed 10 Cr distributor share worldwide in 17 days. 118 written and directed by Cinematographer turned film director K. V. Guhan on his Tollywood directorial debut. The film stars Kalyan Ram, Shalini Pandey and Nivetha Thomas in the lead roles. The music for the film is composed by Shekar Chandra and the film is produced by Mahesh S Koneru under the production company East Coast Production.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X