118 బిజినెస్ క్లోజ్... ఎఫ్ 2 తర్వాత ఇదే పెద్ద హిట్టు!
Recommended Video

కళ్యాణ్ రామ్ హీరోగా కెవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ '118' చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ ముగిసింది. మార్చి 1న విడుదలైన ఈ చిత్రం నేటితో విజయవంతంగా 4 వారాలు పూర్తి చేసుకుని మంచి బిజినెస్ చేసింది.
2019లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నమోదైన 2వ హిట్ మూవీ ఇది. సంక్రాంతికి వచ్చిన 'ఎఫ్ 2' తర్వాత తెలుగులో ఒక్క హిట్టు పడలేదు. 118 మూవీ మంచి హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకెళ్లింది. వరుస ప్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్‌కు కూడా ఈ చిత్రం బూస్ట్ ఇచ్చింది.

నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది
‘118' చిత్రం నిర్మాతలతో పాటు సినిమాను కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావవడంతో పాటు రూపాయికి రూపాయి లాభం వచ్చిందని నిర్మాత మహేష్ ఎస్ కోనేరు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

వరల్డ్ వైడ్ షేర్
‘118' చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.45 కోట్ల షేర్ రాబట్టింది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ రూ. 6.90 కోట్లకు అమ్మారు. ఈ చిత్రాన్ని కొనుగులో చేసిన డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు రూ. 4 కోట్ల మేర లాభం వచ్చింది.

ఏరియా వైజ్ షేర్ వివరాలు
నైజాం రూ. 4 కోట్లు, సీడెడ్ రూ. 1.25 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.20 కోట్లు, గుంటూరు రూ. 70 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 62 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 48 లక్షలు, కృష్ణ రూ. 80 లక్షలు, నెల్లూరు రూ. 25 లక్షలు, రెస్టాఫ్ ఇండియా రూ. 75 లక్షలు, ఓవర్సీస్ రూ. 40 లక్షలు రాబట్టింది.

బిజినెస్ క్లోజ్
మార్చి 29న కొత్త సినిమాలు వస్తుండటంతో ‘118' బిజినెస్ క్లోజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్‌కుతో పాటు నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకుడిగా చేసిన తొలి చిత్రమిది. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ కొనేరు నిర్మించారు.


Click it and Unblock the Notifications











