twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    15 years Of Vikramarkudu: పవర్ స్టార్ రిజెక్ట్ చేయడానికి కారణమిదే.. షూటింగ్ లో గొడవ.. కలెక్షన్స్ ఎంతంటే?

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా పవర్ఫుల్ పొలీస్ బ్యాక్ డ్రాప్ సినిమాలను లిస్టులోకి తీసుకుంటే అందులో విక్రమార్కుడు మూవీ టాప్ లిస్టులో ఉంటుంది. విక్రమ్ రాథోడ్ క్యారెక్టర్ చూసిన తరువాత చాలామంది సినీ ప్రముఖులు రవితేజలో అంత సీరియస్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని ఊహించలేదని అన్నారు. ఇక నేడు సినిమా విడుదలై 15 ఏళ్లవుతోంది. ఇక సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ తో పాటు అసలు పవన్ కళ్యాణ్ ఈ మూవీని ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయంలోకి వెళితే..

     యమదొంగ వల్ల పుట్టిన కథ

    యమదొంగ వల్ల పుట్టిన కథ

    దర్శకధీరుడు రాజమౌళి సై, ఛత్రపతి వంటి బాక్సాఫీస్ హిట్స్ అనంతరం సొంత బ్యానర్ లోనే యమదొంగ సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అప్పటికి చేతిలో అనుకున్నంత బడ్జెట్ లేకపోవడంతో నిర్మాత ML కుమార్ చౌదరి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో మరొక సినిమా చేసి 100% బాక్సాఫీస్ హిట్టు కొట్టాలని అనుకున్నాడు. అప్పుడు తన తండ్రి విజయేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్లి కొన్ని కథలపై చర్చలు జరిపారు.

    జక్కన్న మైండ్ లోకి వచ్చిన మొదటి హీరో

    జక్కన్న మైండ్ లోకి వచ్చిన మొదటి హీరో

    ఇక అనేక కథలపై చర్చలు జరుపుతున్న క్రమంలో ఒక పవర్ఫుల్ పొలీస్ క్యారెక్టర్ గురించి తెలుసుకున్నాడు. ఆ పాత్ర చుట్టూ ఎమోషన్ ను కూడా జత చేయాలని అలాగే కామెడీ కూడా ఉండేలా కమర్షియల్ గా మార్చాలని సజెస్ట్ చేశారట. కథ మొత్తం వినగానే మొదట రాజమౌళి మైండ్ లో మొదటి పవర్ స్టార్ ను ఊహించుకున్నారు. పవర్ స్టార్ యాక్షన్ సీన్ లో కనిపిస్తే ఇండస్ట్రీ రికార్డులు బ్లాస్ట్ అవ్వడం కాయమని కథ మొత్తం రెడీ చేశారు.

     పవన్ రిజెక్ట్ చేయడానికి కారణం

    పవన్ రిజెక్ట్ చేయడానికి కారణం

    ఇక బంగారం షూటింగ్ లో ఉండగా పవన్ కళ్యాణ్ ను కలిసి రాజమౌళి కథ మెయిన్ లైన్ గురించి చెప్పారు. అయితే అప్పటికే అన్నవరం సినిమా కూడా లైన్ లో ఉండడంతో ఆ సినిమాల అనంతరం పవన్ కొంచెం గ్యాప్ తీసుకోవాలని అనుకున్నాడు. అదే విషయాన్ని సున్నితంగా చెప్పడంతో రాజమౌళికి ఓపిక పట్టలేక పవన్ ను మైండ్ లో నుంచి తీసేసి రవితేజను ఫిక్స్ చేసుకున్నాడు.

    జనాలు రాళ్ళు విసరడంతో

    జనాలు రాళ్ళు విసరడంతో

    ఇక సినిమాను పక్కా ప్లానింగ్ తో స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ కర్ణాటకలోని ఒక క్వారీలో షూటింగ్ చేస్తుండగా అక్కడ లోకల్ జనాలు గొడవకు దిగారు. మీ వల్ల పనులకు అంతరాయం కలుగుతోందని చిత్ర యూనిట్ పై వందల సంఖ్యలో జనాలు రాళ్లు విసిరారు. ఆ క్రమంలో చాలామంది యూనిట్ కు గాయాలయ్యాయి. రాజమౌళి చేతికి కూడా గాయమయ్యింది. కొంతమందిని అపోలో హాస్పిటల్ లో కూడా జాయిన్ చేయాల్సివచ్చింది.

    మొదట డివైడ్ టాక్

    మొదట డివైడ్ టాక్

    ఇక సినిమాను 2006 జూలై 24న విడుదల చేయగా మొదట్లో కొంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మాస్ అడియెన్స్ మాత్రం సినిమాను మళ్ళీ మళ్ళీ చూశారు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా చూపించి అనంతరం ఇంటర్వెల్ ట్విస్ట్ మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక సెకండ్ హాఫ్ లో విక్రమ్ రాథోడ్ చెప్పిన పోలీస్ డైలాగ్స్ రైల్వే స్టేషన్ ఫైట్, పోలీస్ భార్యను కాపాడే సీన్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. అనుష్కకు కూడా ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ ను అందుకుంది.

    Recommended Video

    Rajamouli Not Happy With Jinthaktha Tha Title
     బడ్జెట్.. కలెక్షన్స్.. ఎంతంటే?

    బడ్జెట్.. కలెక్షన్స్.. ఎంతంటే?

    ఇక బాక్సాఫీస్ వద్ద విక్రమార్కుడు కలెక్షన్స్ తో అప్పట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 11కోట్ల బడ్జెట్ తో నిర్మించగా 25కోట్లకు పైగా వసూళ్లను అందుకొని అటు నిర్మాతకు ఇటు బయ్యర్లకు మంచి ప్రాఫిట్స్ ను అందించింది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ వదిలేసిన మరో సినిమా రవితేజ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక ఈ సినిమాను హిందీ, తమిళ్, మళయాళం, కన్నడలో కూడా రీమేక్ చేయగా అక్కడ కూడా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.

    English summary
    If we take the list of Powerful Police Backdrop movies not only in the Tollywood industry but also across the country, Vikramarkudu will be in the top list of movies. After seeing hero character, many movie celebrities said that they did not expect Ravi Teja to have such serious acting skills. Today marks the 15th anniversary of the film's release. If we go into the reason why the original Pawan Kalyan rejected this movie along with the collections related to the movie ..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X