16 Years Of Pokiri: ఈ సంచలన విజయంలో శక్తి దర్శకుడి పాత్ర కూడా.. పెట్టింది ఎంత.. వచ్చింది ఎంత?

టాలీవుడ్ సూపర్ స్టార్ గా మహేష్ బాబును మరో స్థాయికి నిలబెట్టిన సినిమా పోకిరి అని అందరికి తెలిసిన విషయమే. ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిన పోకిరి సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు. ఇక ఈ సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. యాక్షన్ లో కామెడీతో పాటు ఎమోషన్స్ హీరోయిజాని ఒక రేంజ్ లో చూపించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇక ఈ సినిమా విజయంలో శక్తి, షాడో చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ పాత్ర కూడా ఉంది అని చాలా తక్కువమందికి తెలుసు. అసలు అతను ఈ సినిమా కోసం ఎలాంటి వర్క్ చేశాడు. అలాగే సినిమాపై పెట్టిన పెట్టుబడి ఎంత? ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది ఎంత అనే వివరాల్లోకి వెళితే..

పోకిరి కంటే ముందే..

పోకిరి కంటే ముందే..

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మహేష్ బాబుతో సినిమా చేయాలని పోకిరి కంటే ముందు రెండు మూడు సార్లు ప్రయత్నం చేశాడు. కానీ మహేష్ కథ విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక ఆ తరువాత వరుస విజయాలతో పూరికి మంచి బ్రాండ్ క్రియేట్ అవ్వడంతో అతని మీద నమ్మకం ఉంచి మహేష్ పోకిరి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

వంద రోజుల్లో..

వంద రోజుల్లో..

ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ మహేష్ బాబు తో ఈ సినిమా షూటింగ్ ను వంద రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. మహేష్ బాబు కూడా పూరి మేకింగ్ కు ఫిదా అయిపోయాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్లో పాల్గొనడం జరిగింది. అప్పట్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఫస్ట్ అనుకున్న టైటిల్

ఫస్ట్ అనుకున్న టైటిల్

ఇక ఈ సినిమా కు మొదట పోకిరి అనే టైటిల్ కంటే మరొక టైటిల్ అనుకున్నారట. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమా కథను మరికొంత మంది హీరోలకు కూడా చెప్పడం జరిగింది. కానీ మహేష్ బాబు దగ్గరికి వచ్చిన తర్వాత కొంత స్టైల్ ను కూడా మార్చేశారు. ఇక మొదట ఉత్తమ్ సింగ్ అనే టైటిల్ ను అనుకున్నప్పటికీ ఆ తర్వాత మహేష్ బాబు ఒప్పుకోకపోవడంతో పోకిరి టైటిల్ ని ఫిక్స్ చేశారు.

ఇలియానాకు లక్కీ ఛాన్స్

ఇలియానాకు లక్కీ ఛాన్స్

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా నటించిన విషయం తెలిసిందే. ఒక విధంగా ఆమెకు ఈ సినిమా చాలా అదృష్టంగా దక్కింది అని చెప్పాలి. ఎందుకంటే ఆమె కంటే ముందు దర్శకుడు పూరిజగన్నాథ్ నలుగురు హీరోయిన్స్ ని సంప్రదించాడు. అందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, ఆయేషా టాకియా అలాగే పార్వతీమెల్టన్ కూడా ఉంది. ఇక అప్పుడే దేవదాసు సినిమాతో సక్సెస్ కొట్టిన ఇలియానా ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని పూరి ఆమెను ఫైనల్ చేయడంతో ఆ సినిమాతో ఇలియానా కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.

బడ్జెట్ ఎంతంటే?

బడ్జెట్ ఎంతంటే?

పోకిరి సినిమాను మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్ తన సొంత బ్యానర్ లో సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ సినిమాను 12 కోట్ల బడ్జెట్ తోనే పూర్తి చేశారు. షూటింగ్ లో అయితే మహేష్ బాబు చాలా వరకు ప్రతి షాట్ ను కూడా సింగిల్ టేక్ లో నే ఫినిష్ చేశాడు.

ప్రాఫిట్స్ ఎంతంటే?

ప్రాఫిట్స్ ఎంతంటే?

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటివరకు ఉన్న బిగ్గెస్ట్ రికార్డులన్నింటినీ కూడా బ్రేక్ చేసి నెంబర్ వన్ సినిమా గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 60 కోట్ల వరకు కలెక్ట్ చేసిన ఈ సినిమా నిర్మాతలకు 20 కోట్లకు పైగా ప్రాఫిట్స్ అందించినట్లు సమాచారం.

మెహర్ రమేష్ కూడా..

మెహర్ రమేష్ కూడా..

అయితే ఈ సినిమా గురించి అందరికీ పెద్దగా తెలియని విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు దర్శకుడు మెహర్ రమేష్ కూడా పని చేశాడు. శక్తి, షాడో డిజాస్టర్ సినిమాలను తెరకెక్కించిన మెహర్ రమేష్ అంతకుముందు పూరి జగన్నాథ్ కు మంచి స్నేహితుడు. అయితే అతను స్క్రీన్ ప్లే మాటల విషయంలో, అలాగే పూరి జగన్నాథ్ కు స్క్రిప్టు విషయంలో చాలా హెల్ప్ చేశాడు. ఆ క్రెడిట్ సినిమా టైటిల్స్ లో కూడా ఇవ్వడం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X