17 years of Yagnam: గోపీచంద్‌కు హీరోగా ప్రాణం పోసిన యజ్ఞం.. మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?
మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న తొట్టెంపూడి గోపిచంద్ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకొచ్చాడు. ఇక అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో యజ్ఞం కూడా ఉంది. 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లో భారీ వసూళ్లను అందుకొని హీరోగా నిలదొక్కుకోవడానికి గోపిచంద్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక ఆ సినిమా విడుదలై నేటికి 17ఏళ్లవుతోంది. ఆ సినిమా కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

వెనక్కి తగ్గకుండా
తొలి వలపు సినిమాతో హీరోగా పరిచయమైన గోపిచంద్ మొదటి సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత సినిమాలు చేయవద్దని చాలామంది చెప్పినప్పటికీ గోపిచంద్ వెనక్కి తగ్గకుండా ముందు నటుడిగా సెట్టవ్వాలని విలన్ గా చేశాడు. జయం, వర్షం, నిజం వంటి సినిమాలతో విలన్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు.

ఎన్నో కథలను విని..
స్టార్ డమ్ రావడంతో మళ్ళీ హీరోగా ట్రై చేయాలని అనుకోని అనేక రకాల కథలు విన్న గోపిచంద్ ఫైనల్ గా యజ్ఞం సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీని జత చేసిన దర్శకుడు AS రవి కుమార్ చౌదరి అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ను హైలెట్ చేశాడు.

సరికొత్త పాయింట్ తో వచ్చిన కథ
సినిమాలో మంచి సందేశం కూడా వర్కౌట్ అయ్యింది. అప్పటి వరకు ఫ్యాక్షన్ కథలలో మెయిన్ విలన్స్ ను చంపే రొటీన్ పాయింట్స్ ఉండేవి. కానీ ఫ్యాక్షన్ లీడర్ల వెనుక ఉండే సాధారణ మనుషుల కుటుంబాల పరిస్థితులను ఎవరు చూపించలేదు. దర్శకుడు రవి కుమార్ ఆ పాయింట్ ను బాగా హైలెట్ చేసి యజ్ఞం కథకు న్యాయం చేశాడు.

కలెక్షన్స్ ఎంతంటే?
మూన్ బెనర్జీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం కూడా బాగా హెల్ప్ అయ్యింది. ఈతరం ఫిలిమ్స్ లో పోకూరి బాబూరావు ఈ సినిమాని నిర్మించారు. ఇక సినిమాని 4.50కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద 8.93కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ ను అందించింది. ఇక ఆ సినిమా హిట్టయిన వెంటనే గోపీచంద్ కు హీరోగా వరుసగా అవకాశాలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











