18 Pages day 1 collections నిఖిల్ కెరీర్‌లో రికార్డు ఓపెనింగ్స్.. తొలి రోజు 18 Pages కలెక్షన్లు ఎంతంటే?
కార్తీకేయ 2 భారీ విజయం తర్వాత నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ నటించిన 18 Pages మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు భారీ అంచనాలు పెంచాయి. దాంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. డిసెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన తొలి రోజు కలెక్షన్ల అంచనాలు, సినిమాకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయంటే?

నిఖిల్, అనుపమ రెండోసారి
కుమారి 21F చిత్రంతో భారీ సక్సెస్ అందుకొన్న పల్నాటి సూర్య ప్రకాశ్ దర్శకత్వంలో రూపొందిన 18 పేజేస్ సినిమా పక్కా లవ్ స్టోరీతో తెరకెక్కింది. నిఖిల్, అనుపమ మరోసారి ప్రేమికులుగా నటించారు. దర్శకుడు సుకుమార్ రైటింగ్ ఈ సినిమాకు కథను అందించారు. బన్నీ వాసు, జీఏ2 బ్యానర్‌పై తెరకెక్కించారు. ఈ సినిమాకు సెన్సార్ UA సర్టిఫికెట్‌ను ఇచ్చారు. ఈ సినిమా నిడివి 2 గంటల 17 నిమిషాలుగా సెట్ చేశారు.

18 కోట్ల వ్యయంతో
18 Pages చిత్రాన్ని 18 కోట్ల వ్యయంతో రూపొందించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూపంలో 22 కోట్లు సంపాదించి పెట్టింది. శాటిలైట్, మ్యూజిక్ రైట్స్‌కు భారీ ప్రతిఫలం దక్కడంతో రిలీజ్‌కు ముందే 6 కోట్ల లాభాన్ని ఈ సినిమా ఆర్జించింది.

రిలీజ్‌కు ముందే లాభాల్లోకి
లవ్, హ్యుమన్ ఎమోషన్స్ కలబోసి రూపొందించిన 18 Pages చిత్రం రిలీజ్‌కు ముందే క్రేజీగా బజ్ క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఓవర్సీస్‌తో కలిపి పలు దేశాల్లో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 845 థియేటర్లలో రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కలిపి 385 థియేటర్లలో రిలీజ్ చేశారు. ఆంధ్రాలో 185 థియేటర్లలో, నైజాంలో 135 థియేటర్లలో, సీడెడ్‌లో 65 థియేటర్లలో విడుదల చేశారు.

18 Pages తొలి రోజు ఆక్యుపెన్సీ
18 Pages సినిమాకు తొలి రోజు మిక్సడ్ టాక్ లభించింది. సినిమా ఫస్టాఫ్ స్లోగా సాగిందని, సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగిందనే టాక్‌ను సొంతం చేసుకొన్నది. అయితే నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ఆన్ స్క్రీన్ బాండింగ్ ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఫీల్‌గుడ్ మూవీ అనే అభిప్రాయాన్ని సొంతం చేసుకొన్నది. ఇక కాకినాడలో అత్యధికంగా 77 శాతం అక్యుపెన్సీ, చెన్నై, వరంగల్, హైదరాబాద్, చెన్నైలో 30 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ కనిపించింది.

తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే
18 Pages సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియా వైడ్ ఈ సినిమా 3 కోట్ల షేర్ సాధించే అవకాశం ఉంది.తొలి రోజు పలు ప్రాంతాల్లో ఫస్ట్ షో సమయంలో ఆక్యుపెన్సీ పుంచుకోవడంతో భారీ వసూళ్లు సాధించడానికి అవకాశం ఏర్పడింది. ఇక ఓవర్సీస్‌లో కలుపుకొంటే ఈ చిత్రం 3.5 నుంచి 4 కోట్ల షేర్, 7 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

18 Pages లాభాల్లోకి రావాలంటే?
ఇక 18 Pages చిత్రం థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 12.75 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తే.. నిఖిల్ మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











