For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయ్యోపాపం 2.0.. చైనాలో దారుణంగా కలెక్షన్లు.. శంకర్, రజనీకి దిమ్మతిరిగేలా షాక్

    |
    Huge Drop In 2.0 China Box-Office Collections

    సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన 2.0 జీరో చిత్రం గత వారం చైనాలో అట్టహాసంగా రిలీజైంది. అయితే చైనా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమైంది. అంతేకాకుండా చైనా బాక్సాఫీస్ వద్ద పేలవమైన వసూళ్లను వసూలు చేసి తీవ్ర నష్టాలను చవిచూసే దిశగా సాగుతున్నది. చైనాలో 2.0 చిత్రానికి సంబంధించి ఎంత మేరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందంటే..

    48 వేల 3డీ స్క్రీన్లలో

    48 వేల 3డీ స్క్రీన్లలో

    రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 2.0 చైనాలో రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజైంది. సుమారు 48 వేల 3డీ స్క్రీన్లలో విడుదల చేశారు. ఒక భారతీయ సినిమా ఈ రేంజ్‌లో విడుదల కావడం ఇదే తొలిసారి. అయితే చైనా బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం తొలి రోజు సంచలన వసూళ్లను నమోదు చేసింది. అంతేకాకుండా హాలీవుడ్, చైనా సినిమాలకు ధీటుగా వసూళ్లు రాబట్టిందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడంలో దారుణంగా బోల్తాపడింది.

     అనేక కష్టాల మధ్య రిలీజ్

    అనేక కష్టాల మధ్య రిలీజ్

    ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ రూపొందించిన 2.0 చిత్రం రిలీజ్‌కు ముందు పలు అవాంతరాలను ఎదుర్కొన్నది. గత కొద్దినెలలుగా సినిమాను రిలీజ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల విషయంలో తీవ్ర జాప్యం ఎదురైంది. నిర్మాత సినిమాను రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొందనే సంతోషం ఎక్కువ సేపు ఉండలేదు.

     దారుణంగా నాలుగు రోజులు కలెక్షన్లు

    దారుణంగా నాలుగు రోజులు కలెక్షన్లు

    రజనీకాంత్ 2.0 గత నాలుగు రోజుల్లో భారతీయ కరెన్సీలో రూ.20 కోట్లు వసూలు చేసింది. తొలి రోజు 1.37 మిలియన్ డాలర్లు, రెండో రోజు 0.72 మిలియన్ డాలర్లు, మూడో రోజు 0.39 మిలియన్ డాలర్లు, నాలుగో రోజు 0.18 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    లాభాల్లోకి రావాలంటే..

    లాభాల్లోకి రావాలంటే..

    అయితే ఇలా పేలవమైన వసూళ్లు రాబట్టడంతో 2.0 కథ కంచికి చేరినట్టే అనే మాట వినిపిస్తున్నది. ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడి రావాలంటే దాదాపు 25 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కనీసం 3 మిలియన్ డాలర్లు కూడా వసూలు చేయలేకపోయింది. అయితే కొంత మేరకు కాదుగదా.. సమీపంలోకి కూడా వసూళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

    English summary
    2.0 China box office collections: Rajini, Shankar magic didnt work
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X