చైనా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 2.0.. తొలి రోజే రికార్డు.. భారీగా కలెక్షన్లు
Recommended Video
సంచలన దర్శకుడు శంకర్, సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 2.0 చిత్రం దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు చైనాలో ఈ చిత్రం సంచలనం రేపేందుకు రెడీ అయింది. సెప్టెంబర్ 6వ తేదీన చైనా ప్రేక్షకుల ముందుకు 2.0 వచ్చింది. ఈ సినిమా తొలి రోజున చైనా బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసిందంటే..

48 వేల స్క్రీన్లలో
రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 2.0 చైనాలో రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజైంది. సుమారు 48 వేల 3డీ స్క్రీన్లలో విడుదల చేశారు. ఒక భారతీయ సినిమా ఈ రేంజ్‌లో విడుదల కావడం ఇదే తొలిసారి. అయితే చైనా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సంచలన వసూళ్లను నమోదు చేసింది. అయితే హాలీవుడ్, చైనా సినిమాలకు ధీటుగా వసూళ్లు రాబట్టడం చర్చనీయాంశమైంది.

తొలి రోజు భారీగా కలెక్షన్లు
2.0 సినిమాపై చైనా సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి బ్రహ్మండమైన రెస్సాన్స్ రావడంతో భారీ కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం చైనా బాక్సాఫీస్ వద్ద 9 కోట్ల (1.28 మిలియన్ డాలర్లు) రూపాయాలకుపైగా కలెక్షన్లను సాధించింది అని ట్రేడ్ అనలిస్టు కౌశిక్ ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించే అవకాశముందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

చైనా బాక్సాఫీస్ షేక్
2.0 చిత్రం భారీ కలెక్షన్లు సాధించడమే కాకుండా ఓ రికార్డు కూడా క్రియేట్ చేసింది. చైనా బాక్సాఫీస్ వద్ద రజనీ సినిమా మూడోస్థానంలో నిలిచింది. అంతేకాకుండా రిలీజైన ప్రతీ చోట ప్రేక్షకుల నుంచి మంచి కలెక్షన్లు కూడా వస్తున్నాయనే విషయం మీడియాలో వ్యక్తమయ్యాయి. అలాగే మీడియాలో కూడా ఈ సినిమాపై సానుకూల కథనాలు వెలువడంతో క్రేజ్ పెరిగిందని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

అనేక అవాంతరాలను ఎదుర్కొని
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ రూపొందించిన 2.0 చిత్రం రిలీజ్‌కు ముందు పలు అవాంతరాలను ఎదుర్కొన్నది. గత కొద్దినెలలుగా సినిమాను రిలీజ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల విషయంలో తీవ్ర జాప్యం ఎదురైంది. నిర్మాత సినిమాను రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











