2.0 డే2 కలెక్షన్స్: రెండో రోజు అక్కడ దుమ్ము దుమారం.. కానీ ఇక్కడ సర్కార్ ముందు!

Recommended Video

#2point0 Box Office Collection Day 2 : Vijay's Sarkar Has Upper Hand Over 2.O | Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనికాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన 2.0 చిత్రం రోజు రోజుకు పుంజుకుంటోంది. అటు క్రిటిక్స్ నుంచి, ఇటు అభిమానుల నుంచి పాజిటివ్ టాక్ తో ప్రారంభమైన 2.0 వసూళ్లు తొలిరోజు కాస్త నిరాశపరిచాయి. అన్ని ఏరియాలలో మంచి వసూళ్లే వచ్చాయి కానీ తమిళనాడులో మాత్రం ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఈ చిత్రానికి వెచ్చించిన బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఈ వసూళ్లు ఆశాజనకంగా లేవని చెప్పొచ్చు. కానీ రెండవ రోజు మాత్రం 2.0 అద్భుతంగా పుంజుకుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా హిందీ వర్షన్ లో ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రెండవరోజు వసూళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

 తమిళనాడులో

తమిళనాడులో

భారీ అంచనాలతో విడుదలైన 2.0 చిత్రానికి తమిళనాడులో ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవు. రెండు రోజుల్లో ఈ చిత్రం రాబట్టిన మొత్తం గ్రాస్ 27 కోట్లు మాత్రమే అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల విడుదలైన సర్కార్ చిత్రాన్ని బీట్ చేయడంలో రజని మూవీ ఫెయిల్ అయింది. కానీ చెన్నై నగరంలో మాత్రం 2.0 చిత్రానికి బలమైన వసూళ్లు వస్తుండడం విశేషం. తొలిరోజు రాజధాని నగరంలో 2.64 కోట్లు రాబట్టింది. రెండవ రోజు కూడా వసూళ్లు స్టడీగానే ఉన్నాయి. రెండవరోజు 2.13 కోట్లు రాబట్టింది. మొత్తంగా చెన్నై నగరంలో రెండు రోజుల్లో 2.0 చిత్రం 4.77 కోట్లు రాబట్టింది.

చాలా తక్కువ

చాలా తక్కువ

తమిళనాడు వ్యాప్తంగా సర్కార్ చిత్రంతో పోల్చితే 2.0 వసూళ్లు చాలా తక్కువ అని చెప్పొచ్చు. సర్కార్ చిత్రం రెండు రోజుల్లోనే తమిళనాడులో 50 కోట్ల మార్క్ అందుకుంది. కానీ 2.0 చిత్రం కనీసం 30 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. సర్కార్ చిత్రానికి దీపావళి సెలవులు కలసి వచ్చాయని చెప్పొచ్చు. 2.0 చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తున్నా వసూళ్లు తక్కువ నమోదు కావడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి.

త్రీడీలో ఎక్కువగా

త్రీడీలో ఎక్కువగా

2.0 చిత్రానికి 2డిలో కంటే త్రీడి ఫార్మాట్ లో మంచి స్పందన వస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు ఈ చిత్రానికి ఫిదా అవుతున్నారు. ఇంకా రెండు రోజుల పటు వీకెండ్ ఉండడంతో వసూళ్లు స్టడీగా ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి 370 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది.

హిందీలో దుమారమే

హిందీలో దుమారమే

2.0 చిత్ర యూనిట్ కు సంతోషాన్ని కలిగించే అంశం ఏంటంటే.. హిందీలో తిరుగులేని రెస్పాన్స్ వస్తోంది. టాక్ పరంగా, వసూళ్ల పరంగా అదరగొడుతోంది. తొలిరోజు కంటే రెండవ రోజు 2.0 హిందీ వర్షన్ అత్యధిక వసూళ్లు రాబట్టడం ట్రేడ్ విశ్లేషకులని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హిందీ ప్రేక్షకులు ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతున్నారు. పైగా అక్షయ్ కుమార్ క్రేజ్ కూడా ఉండడం భారీ వసూళ్లు నమోదవుతున్నాయి.

తొలిరోజు కంటే ఎక్కువగా

తొలిరోజు కంటే ఎక్కువగా

హిందీలో ఈ చిత్రం తొలి రోజు 20 కోట్లు రాబట్టింది. రెండవరోజు 23 కోట్లు రాబట్టడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హిందీలో బాగా క్రేజ్ ఉన్నా అక్షయ్ కుమార్ నటించడంతో కలసి వచ్చింది. రాబోవు రెండు రోజుల్లో కూడా ఇదే తరహాలో వసూళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అద్భుతమైన విజువల్స్ లో శంకర్ మరో కొత్త లోకాన్ని సృష్టించారని ప్రశంసలు దక్కుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X