2.0 బాక్సాఫీసు కలెక్షన్స్: 5వ రోజు ఊహించని రీతిలో పతనం!
Recommended Video

రజనీకాంత్ హీరోగా రూపొందిన విజువల్ వండర్ 2.0 ఫస్ట్ వీకెండ్ వరకు బాక్సాఫీసు వద్ద దుమ్మురేపే కలెక్షన్లతో అదరగొట్టింది. అయితే 5వ రోజైన సోమవారం కలెక్షన్లు ఊహించని రీతిలో పతనం అయ్యాయి. ముఖ్యంగా హిందీ బాక్సాఫీసు వద్ద పరిస్థితి చాలా దారుణంగా ఉందని ట్రేడ్ వర్గాల టాక్.
దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసిన ఈ చిత్రం... అతిపెద్దదైన హిందీ బాక్సాఫీసు వద్ద అదరగొడితేనే ఓవరాల్ కలెక్షన్లు పెరుగుతాయి. అయితే ఇక్కడ ఆదరణ బావున్నప్పటికీ ఆశించిన స్థాయిలో లేదనేది ట్రేడ్ విశ్లేషకుల వాదన.

తొలి రోజు నుంచే సమస్య
శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే హిందీ బాక్సాఫీసు వద్ద మామలు స్థాయిలో వసూళ్లు మొదలయ్యాయి. గురువారం విడుదలైన ఈ చిత్రం రూ. 20.25 కోట్లతో మొదలైంది. రెండో రోజు దాదాపు పది శాతం మేర పడిపోయి రూ. 18 కోట్లు మాత్రమే రాబట్టింది.

వీకెండ్ సూపర్ అనిపించింది
అయితే వీకెండ్స్ కావడంతో శని, ఆదివారాల్లో కలెక్షన్ల వరద పారింది. శనివారం రూ. 25 కోట్లు, ఆదివారం రూ. 34 కోట్లు రాబట్టింది. ఈ రెండు రోజుల్లో షేర్ కూడా భారీగానే రాబట్టింది.

సోమవారం సగం మేర పతనం
అయితే సోమవారం వీక్ డేస్ మొదలవ్వడంతో కలెక్షన్లు దాదాపు సగం మేర పడిపోయాయి. సోమవారం హిందీ వెర్షన్ ఆలిండియా వైడ్ రూ. రూ. 13.75 కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో ఇండియా వైడ్ హిందీ వెర్షన్ టోటల్ బిజినెస్ రూ. 111 కోట్లకు రీచ్ అయింది.

వరల్డ్ వైడ్ ఎంత?
అయితే 2.0 చిత్రం ఫస్ట్ వీకెండక్ వరల్డ్ వైడ్ రూ. 400 కోట్ల గ్రాస్ సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే సినిమా బడ్జెట్, భారీ రిలీజ్ పరంగా చూస్తే ఇది చాలదు, అంతకు మించి వసూళ్లు వస్తేనే ఓవరాల్‌గా వర్కౌట్ అవుతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











