2.0 మూవీ కలెక్షన్ల సంచలనం: 100 మిలియన్ వసూళ్లతో ప్రభంజనం!

రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.0 మూవీ ఇంటర్నేషనల్ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇంటర్నేషనల్ బాక్సాఫీసు వద్ద రూ. 700 కోట్లు (100 మిలియన్ డాలర్స్) రాబట్టింది.

2018లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన చిత్రాల్లో 100 మిలియన్ డాలర్స్ వసూలు చేసిన చిత్రాలు 53 ఉండగా... ఇండియా నుంచి '2.0', 'సీక్రెట్ సూపర్ స్టార్' మాత్రమే అందులో చోటు దక్కించుకోవడం విశేషం.

 రజనీకాంత్ మూవీ రేంజి అదీ

రజనీకాంత్ మూవీ రేంజి అదీ

రజనీకాంత్ నటించిన 2.0 చిత్రం నవంబర్ 29న విడుదలవ్వగా, మరో ఇండియన్ మూవీ ‘సీక్రెట్ సూపర్ స్టార్' చిత్రం కూడా ఈ ఏడాది చైనాలో విడుదలైంది. ఈ రెండు చిత్రాలకు ఈ ఏడాది 100 మిలియన్‌ డాలర్లకుపైగా బిజినెస్ జరిగింది.

 అత్యంత ఖరీదైన చిత్రం

అత్యంత ఖరీదైన చిత్రం

ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ 2.0. ఈ చిత్రం కోసం దాదాపు రూ. 550 కోట్లు ఖర్చు చేశారు. వాస్తవానికి ఇంత బడ్జెట్ ముందుగా అనుకోలేదు. అయితే ఒక కంపెనీ అందించిన విఎఫ్ఎక్స్ విషయంలో సంతృప్తి చెందని శంకర్.... బెటర్మెంట్ కోసం ప్రయత్నించడంతో ఖర్చు బాగా పెరిగిపోయిందని టాక్.

 ఎన్నో ప్రత్యేకతలు

ఎన్నో ప్రత్యేకతలు

తన ప్రతి సినిమాలోనూ భారీతనం చూపించే దర్శకుడు శంకర్... 2.0 చిత్రాన్ని ఎన్నో ప్రత్యేకతలతో ప్రేక్షకుల ముంకు తీసుకొచ్చాడు. ఇండియన్ సినిమాలో వచ్చిన ది బెస్ట్ 3డి మూవీ ఇది. టెక్నికల్ వ్యాల్యూస్ పరంగా టాప్ రేటెడ్ మూవీ ఇది.

చైనా రిలీజ్ తర్వాత ఇంకెన్ని సంచలనాలో

చైనా రిలీజ్ తర్వాత ఇంకెన్ని సంచలనాలో

2.0 చిత్రాన్ని 2019లో చైనాలో 56 వేల స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే దంగల్, బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X