2.0 యూఎస్ఏ బాక్సాఫీస్ 11 డేస్ రిపోర్ట్: అన్ని రికార్డులు కొట్టేసి నెం.1
రజనీకాంత్ హీరో శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2.0 చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఇప్పటి వరకు ఉన్న తమిళ సినిమా రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి నెం.1 స్థానానికి దూసుకెళ్లింది. నార్త్ అమెరికాలో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన తమిళ సినిమాల్లో ఇప్పటి వరకు 'కబాలి' అగ్రస్థానంలో ఉండగా ఆ రికార్డులను ఇప్పుడు 2.0 బద్దలు కొట్టింది.
ఆదివారంతో బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా 11 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 5 మిలియన్ డాలర్ల మార్కును అందుకోవడం విశేషం. దీంతో కబాలి నమోదు చేసిన హయ్యెస్ట్ తమిళ ఫిల్మ్ గ్రాస్ 4.58 మిలయన్ డాలర్ రికార్డును 2.0 అధిగమించినట్లయింది.

ఏమాత్రం తగ్గని క్రేజ్
సినిమా విడుదలైన రెండో రోజు నుంచే మిక్డ్స్ టాక్ ఉన్నప్పటికీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యపై పెద్దగా ప్రభావం చూపలేదు. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ చిత్రం కావడం.. రజనీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి బిగ్ స్టార్స్ ఉండటం, శంకర్ దర్శకత్వం వహించిన మూవీ కావడంతో ముందు నుంచీ ఈ చిత్రంపై క్రేజ్ ఉంది.

ఆ రికార్డులను అందుకోవడం కష్టమే
సౌతిండియన్ చిత్రాల కేటగిరీలో యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రాల్లో 2.0 మూవీ 3వ స్థానంలో ఉంది. బాహుబలి 2 (20.5 మిలియన్), బాహుబలి (6.99 మిలియన్) నమోదు చేసిసన రికార్డులను మాత్రం రజనీ మూవీ అందుకోవడం కష్టమే. లైఫ్ టైమ్ రన్‌లో 2.0 యూఎస్ఏలో 6 మిలియన్ రీచ్ అయ్యే అవకాశం ఉంది.

అక్కడ గట్టిగా కొడితే బ్రహ్మాండం బద్దలవుతుంది
2.0 చిత్రం బడ్జెట్ పరంగా, హైప్ పరంగా కంపేర్ చేస్తే.... బాహుబలి 2 స్థాయి సక్సెస్ సాధించలేదని చెప్పక తప్పదు. అయితే దంగల్ (రూ. 2 వేల కోట్లు), బాహుబలి 2 (రూ. 1800 కోట్లు) రికార్డులు బద్దలవ్వాలంటే చైనాలో 2.0 చిత్రం భారీ విజయం సాధించాలి.

చైనాలో రికార్డ్ స్థాయి రిలీజ్
చైనాలో 2.0 రికార్డ్ స్థాయిలో 56 వేల స్క్రీన్లలో విడుదల కాబోతోంది. అందులో దాదాపు 47 వేల 3డి స్క్రీన్లు ఉన్నాయట. ఈ నేపథ్యంలో చైనాలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలవ్వడం ఖాయం.


Click it and Unblock the Notifications











