twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాభాలు సాధ్యమేనా? తెలుగు రాష్ట్రాల్లో 2.0 కలెక్షన్స్ (ఏరియా వైజ్)

    |

    రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2.0 మూవీ రెండో వారంలో బాక్సాఫీసు వద్ద పరిస్థితి ఫర్వాలేదు అనే విధంగా ఉంది. 13 రోజులు పూర్తి చేసుకున్నఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రూ. 80 కోట్ల గ్రాస్ రీచ్ అయింది.

    సినిమాపై భారీ హైప్ ఉండటంతో ఏపీ, తెలంగాణలో దాదాపు 1400 స్క్రీన్లలో విడుదల చేశారు. అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం తొలి వారం రూ. 68 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. అయితే రెండో వారంలో వసూళ్లు బాగా తగ్గాయి. నాలుగు తెలుగు సినిమాలు విడుదల కావడంతో స్క్రీన్ల సంఖ్య తగ్గడమే ఇందుకు కారణం.

    తెలంగాణ ఎన్నికల ప్రభావం కూడా

    తెలంగాణ ఎన్నికల ప్రభావం కూడా

    2.0 మూవీ రెండో వారానికి చేరుకోగానే కవచం, నెక్ట్స్ ఏంటి? సుభలేఖలు, సుబ్రహ్మణ్యపురం చిత్రాలు విడుదల కావడానికి తోడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా సినిమా వసూళ్లపై ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు. దీంతో సెకండ్ వీక్ వసూల్లు బాగా తగ్గాయి.

    ఇప్పటి వరకు రూ. 80 కోట్లు

    ఇప్పటి వరకు రూ. 80 కోట్లు

    అయితే వారాంతాల్లో ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. సినిమా విడుదలైన రెండో శని, ఆదివారాల్లో రూ. 10 కోట్ల మేర గ్రాస్ రాబట్టింది. దీంతో 13 రోజులు పూర్తయ్యే సమయానికి రూ. 80 కోట్ల మార్కను క్రాస్ అయింది.

    ఏరియా వైజ్ షేర్ ఎంత వచ్చింది?

    ఏరియా వైజ్ షేర్ ఎంత వచ్చింది?

    ఏరియా వైజ్ వసూలైన షేర్ పరిశీలిస్తే నైజాంలో రూ. 21.58 కోట్లు, సీడెడ్ రూ. 6.65 కోట్లు, వైజాగ్ రూ. 5.81 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.3.45 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 2.38 కోట్లు, కృష్ణ రూ. 2.75 కోట్లు, గుంటూరు రూ. 3.32 కోట్లు, నెల్లూరు రూ. 1.75 కోట్ల షేర్ వసూలు చేసింది.

    లాభాలు రావాలంటే?

    లాభాలు రావాలంటే?

    2.0 తెలుగు రైట్స్ రూ. 80 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 47.69 కోట్ల షేర్ వసూలైంది. ఈ చిత్రం లాభాల బాట పట్టాలంటే దాదాపు ఇంకా 30 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.

    రూ. 100 కోట్ల మార్క్ అందుకుంటుందా?

    రూ. 100 కోట్ల మార్క్ అందుకుంటుందా?

    అయితే తెలుగు రాష్ట్రాల్లో 2.0 మూవీ రూ.100 కోట్ల మార్క్ అందుకుంటుందా? లేదా? అనేది వచ్చే వీకెండ్ కలెక్షన్స్ బట్టి అర్థమవుతుంది. అయితే సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ప్రాఫిట్స్ సాధించడం అంత ఈజీ కాదని అంటున్నారు.

    English summary
    Rajinikanth's 2.0 remained undeterred by new releases as it made good collection at the box office in the second weekend. The movie has crossed Rs 80 crore gross mark in Telugu states.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X