2.0 కలెక్షన్ల విధ్వంసం: 15 రోజుల్లో రూ. 700 కోట్లు!
Recommended Video

రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ మూవీ 2.0 బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల విధ్వంసం సృష్టిస్తోంది. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం పలు రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళుతోంది.
గురువారం విజయవంతంగా 15 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 700 కోట్ల మార్కును అందుకుంది. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎవరూ అందుకోలేని సిరికొత్త బెంచ్ మార్క్ నమోదు చేసింది.

రూ. 700 కోట్ల మార్క్ రీచ్ అయింది
తమిళ సినిమా ట్రేడ్ అనలిస్ట్ మనోబాలా 2.0 మూవీ కలెక్షన్స్ వివరాలు వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. తొలి వారం రూ. 526.86 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం సెకండ్ వీక్ (15 డేస్) పూర్తయ్చే సమయానికి రూ. 710.98 కోట్లు రాబట్టినట్లు తెలిపారు.

సెకండ్ వీక్ వసూళ్లు ఇలా...
రెండో వారంలో డే 1 రూ. 27.31 కోట్లు, డే 2 రూ. 32.57 కోట్లు, డే 3 రూ. 36.45 కోట్లు, డే 4 రూ. 39.20 కోట్లు డే 5 రూ. 17.13 కోట్లు, డే 6 రూ. 14.66 కోట్లు, డే 7 రూ. 16.80 రాబట్టినట్లు మనోబాలా వెల్లడించారు.

ఒక్క తమిళనాడులోనే...
2.0 మూవీ ఒక్క తమిళనాడులోనే రెండు వారాల్లో రూ. 166.98 కోట్లు వసూలు చేసింది. రజనీకాంత్ చిత్రాల్లో ఇక్కడ హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రం కూడా 2.0 మూవీనే కావడం గమనార్హం.
హిందీ వెర్షన్ వసూళ్లు
2.0 హిందీ వెర్షన్ 15 రోజుల్లో ఇండియా వ్యాప్తంగా రూ. 177.75 కోట్లు రాబట్టినట్లు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.

చైనా రిలీజ్ తర్వాత రికార్డులన్నీ బద్దలేనా?
త్వరలో 2.0 చిత్రా చైనాలో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఓవరాల్‌గా 56 వేల స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో దాదాపు 47 వేల 3డి స్క్రీన్స్ ఉన్నట్లు సమాచారం. చైనీయుల ఆదరణ లభిస్తే.... 2.0 చిత్రం ఇప్పటి వరకు ‘దంగల్' నమోదు చేసిన రూ. 2 వేల కోట్లు, బాహుబలి 2 పేరు మీద ఉన్న రూ. 1800 కోట్ల రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











