వీక్ డేస్‌లోనూ అదరగొడుతున్న 2.0... 6వ రోజు వసూళ్లు ఎంతంటే?
రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా శంకర్ రూపొందించిన మెగా బడ్జెట్ మూవీ 2.0 బాక్సాఫీసు వద్ద వీక్ డేస్‌లో సైతం మంచి వసూళ్లు సాధిస్తోంది. మంగళవారం ఈ చిత్రం హిందీ వెర్షన్ ఇండియా వ్యాప్తంగా రూ. 11.50 కోట్లు రాబట్టింది. దీంతో టోటల్ హిందీ వెర్షన్ బిజినెస్ రూ. 122.50 కోట్లకు చేరుకుంది.
ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ 2.0 చిత్రానికి సంబంధించిన 6 రోజుల హిందీ వెర్షన్ వసూళ్లు ప్రకటించారు. నార్మల్ డేస్‌లోనూ ఎక్సలెంట్‌గా రన్ అవుతుందని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు బట్టి వచ్చే వీకెండ్ వసూళ్లు మరింత పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
హిందీ మార్కెట్లో ఈ మూవీ ఓపెనింగ్ రోజైన గురువారం రూ. 20.25 కోట్లు, శుక్రవారం రూ. 18 కోట్లు, శనివారం రూ. 25 కోట్లు, ఆదివారం రూ. 34 కోట్లు, సోమవారం రూ. 13.75 కోట్లు, మంగళవారం రూ. 11. 50 కోట్లు రాబట్టింది.

2.0 ఫస్ట్ వీకెండ్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నెక్ట్స్ వీకెండ్ సమయానికి ఈ వసూళ్లు రూ. 600 కోట్లకు రీచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.
మరో వైపు వసూళ్లు పెంచేందుకు నిర్మాతలు ఈ చిత్రాన్ని చైనాలో భారీగా రిలీజ్ చేయబోతున్నారు. చైనా వ్యాప్తంగా 56 వేల స్క్రీన్లలో విడుదల చేయబోతున్నామని, అందులో 47 వేలు 3 డి స్క్రీన్లు ఉన్నట్లు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. అయితే చైనా రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా ఫైనల్ కాలేదు.


Click it and Unblock the Notifications











