2.O మూవీ 14 రోజుల కలెక్షన్లు.. బాహుబలి2 రికార్డు బ్రేక్.. తెలుగులో 100 కోట్లు!
సూపర్‌స్టార్లు రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన 2.O మూవీ మూడో వారంలోకి ప్రవేశించింది. శంకర్ దర్శకత్వంలో అత్యంత సాంకేతికంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రం రెండోవారంలో భారీ కలెక్షన్లు సాధించాయి. దేశీయ, విదేశీ మార్కెట్‌లో నిలకడగా వసూళ్లు సాధించడం గమనార్హం. గత 14 రోజులు కలెక్షన్లు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే ..

అమెరికా బాక్సాఫీస్ వద్ద
ఓవర్సీస్ భారీ చిత్రాల రిలీజ్ మధ్య 2.O మూవీ నిలకడగా వసూళ్లు సాధిస్తున్నది. అమెరికాలో ఈ చిత్రం 244 లొకేషన్లలో మంగళవారం సుమారు 65 వేల డాలర్లు వసూలు చేసింది. గత 14 రోజుల్లో రూ. 36.5 కోట్లు (5,121,567 డాలర్లు) వసూలు చేసినట్టు అయింది.

తెలుగు రాష్ట్రాల్లో
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం సత్తా చాటుతున్నది. డబ్బింగ్ చిత్రంగా వచ్చిన 2.O మూవీ రజనీకాంత్ స్టామినాకు అద్దం పట్టింది. ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో రూ.100 కోట్ల గ్రాస్ సాధించడం విశేషం. ఈ వారం చిన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నందున ఈ సినిమా కలెక్షన్లకు ఢోకా ఉండదనే మాట వినిపిస్తున్నది.

తమిళ, హిందీలో
2.O మూవీ చిత్రం వసూళ్ల పరంగా ఓ రికార్డు సొంతం చేసుకొన్నది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూ.100 కోట్లకుపైగా వసూళ్లను సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది. మూడో వారంలో కూడా పెద్దగా భారీ సినిమాలు లేకపోవడంతో మంచి కలెక్షన్లు రాబట్ట వచ్చని ట్రేడ్ వర్గాలు అంచనావేస్తున్నారు.

బాహుబలి2 రికార్డు బ్రేక్
2.O మూవీ చెన్నైలో బాహుబలి2 రికార్డు బ్రేక్ చేసింది. ఈ చిత్రం 14 రోజుల్లో రూ.20.11 కోట్లు వసూలు చేసింది. బహుబలి రూ.18.85 కోట్లు వసూలు చేయడం తెలిసిందే. అంతేకాకుండా చెన్నైలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పడానికి 2.O మూవీ సిద్ధమైంది. గతంలో కబాలి చిత్రం రూ.24 కోట్లు వసూలు చేసి అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రంగా పేరును సొంతం చేసుకొన్నది.

దేశవ్యాప్తంగా రూ.440 కోట్లు
2.O మూవీ ఉత్తర భారతంలో తాజా చిత్రాలను ధీటుగా కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ చిత్రం రూ.215 కోట్లు వసూళ్లు సాధించింది. దక్షిణ భారతంలో రూ.225 కోట్లతో దూసుకెళ్తున్నది. దీంతో దేశీ మార్కెట్‌తో రూ.440 కోట్లు వసూలు చేసినట్టు ట్రెడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











