twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2.O వరల్డ్ వైడ్ వసూళ్లు: రజనీ క్రేజ్‌తో భారీగా కలెక్షన్లు.. 200 కోట్లవైపు పరుగు

    |

    ఇండియన్ సినిమా హిస్టరీలోనే అతిపెద్ద భారీ చిత్రంగా రూపొందిన 2.O చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణను కూడగట్టుకొంటున్నది. వసూళ్ల పరంగా దూసుకెళ్తూ భారీ కలెక్షన్ల సాధిస్తున్నది. వర్కింగ్ డే కావడం, పండుగ సీజన్ కాకపోవడంతో వసూళ్ల వేగం పెద్దగా కనిపించడం లేదు. రెండో రోజు కలెక్షన్లు కొంత క్షీణించినట్టు కనిపించాయి. కాకపోతే వీకెండ్‌లో 2.O మూవీ కలెక్షన్లు జోరందుకొనే అవకాశం ఉంది. గత రెండు రోజుల్లో 2.O మూవీ సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

     200 కోట్లవైపు

    200 కోట్లవైపు

    2.O మూవీ ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.145.63 కోట్లు సంపాదించింది. వీకెండ్ పూర్తయ్యే సరికి 200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే రెండు రోజులుగా స్టడీగా ఉన్న కలెక్షన్ల చూస్తే వారంతంలో భారీగా పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు.

     తమిళనాడులో రజనీ జోష్‌

    తమిళనాడులో రజనీ జోష్‌

    తమిళనాడులో తొలి రోజే 2.O మూవీ వసూళ్ల పరంగా భారీగా ప్రభావం చూపించింది. తొలిరోజే ఈ చిత్రం రూ.18.2 కోట్లు సాధించింది. ఇక ఈ సినిమా రెండో రోజుల కలెక్షన్లు రూ.27 కోట్లకు చేరుకొంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వారాంతం ముగిసేటప్పటికీ రూ.50 కోట్లు దాటే అవకాశం కనిపిస్తున్నది.

    <strong>600 కోట్ల‌తో తీస్తే ఆ ఓపెనింగ్సా? నిర్మాతకు 200 కోట్లు నష్టం.. అక్షయ్‌పై కమల్ ఖాన్ ఫైర్!</strong>600 కోట్ల‌తో తీస్తే ఆ ఓపెనింగ్సా? నిర్మాతకు 200 కోట్లు నష్టం.. అక్షయ్‌పై కమల్ ఖాన్ ఫైర్!

    తెలుగు రాష్ట్రాల్లో క్రేజీగా వసూళ్లు

    తెలుగు రాష్ట్రాల్లో క్రేజీగా వసూళ్లు

    తమిళంలో కంటే తెలుగు రాష్ట్రాల్లో 2.O మూవీ దూసుకెళ్తున్నది. రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.30 కోట్లు సాధించింది. వీకెండ్‌లో సినిమా హాల్స్ హౌస్‌పుల్‌‌తో నడుస్తున్నట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదే ఊపు కొనసాగితే మరో రెండు రోజుల్లో రూ.50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

    కన్నడ, మలయాళంలో

    కన్నడ, మలయాళంలో

    కర్ణాటక, కేరళలో 2.0 మూవీ భారీగా కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ చిత్రాన్ని కర్టాటకలో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేయగా తొలి రోజు రూ.8 కోట్లు సాధించింది. రెండో రోజు రూ.4 కోట్లు వసూలు చేసింది. కేరళ విషయానికి వస్తే ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.6.10 కోట్లు సాధించింది.

     ఉత్తరాదిలో తగ్గిన వసూళ్లు

    ఉత్తరాదిలో తగ్గిన వసూళ్లు

    ఉత్తరాదిలో 2.O మూవీ కలెక్షన్లు ఊహించినంతగా లేవని ట్రేడ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాకపోతే ఆశాజనకంగాను ఉన్నట్టు వసూళ్లు వెల్లడిస్తున్నాయి. గత రెండు రోజుల్లో రూ.38 కోట్లు వసూలు చేసింది. దాంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.112.63 కోట్లు వసూలు చేసినట్టయింది.

     ఓవర్సీస్‌లో స్పందన ఇలా

    ఓవర్సీస్‌లో స్పందన ఇలా

    2.O మూవీ ఓవర్సీస్ మార్కెట్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే వర్కింగ్ డే కావడం వల్ల అంతగా క్రేజ్ కనిపించడం లేదని పేర్కొంటున్నారు. ఈ చిత్రం గత రెండు రోజుల్లో సుమారు. 33 కోట్లు వసూలు చేసింది. వారాంతంలో భారీగా పెరిగే అవకాశం ఉంది.

    English summary
    2.0 minting Rs 92.4 crore on opening day at the worldwide box office, Shankar's creation has managed to retain the momentum as the business has not heavily dropped on day two. The worldwide gross collection is Rs 145.63 and the movie will breach into the Rs 150-crore club on Saturday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X