twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2.0 వర్సెస్ బాహుబలి... తెలుగు రాష్ట్రాల్లో 5 డేస్ గణాంకాలు ఇవే!

    |

    రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ 2.0 తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే బడ్జెట్ పరంగా పెద్ద సినిమా కాట్టి ఇంతకు ముందు వచ్చిన బాక్సాఫీస్ సంచలనం 'బాహుబలి' కలెక్షన్లతో ఈ చిత్రాన్ని పోల్చి చూస్తున్నారు.

    2.0 చిత్రం సోమవారంతో బాక్సాఫీసు వద్ద 5 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కలెక్షన్లపై హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ ఐదు రోజుల్లో ఎంత వసూలు చేసింది? బాహుబలి రేంజిని అందుకుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

    Recommended Video

    #2point0 Day 5 Collections : 2.0 Hindi Box Office Collections Day 5
    తెలుగు రాష్ట్రాల్లో 2.0 కలెక్షన్

    తెలుగు రాష్ట్రాల్లో 2.0 కలెక్షన్

    టాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 2.0 చిత్రం తొలి 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 36 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. రైట్స్ రూ. 72 కోట్లకు అమ్మిన నేపథ్యంలో... మరో 36 కోట్లు వసూలైతే తప్ప లాభ నష్టాలు లేని బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. అంతకు మించి వసూలు చేస్తే లాభాలు వస్తాయి.

    బాహుబలి 2 ఎంత వసూలు చేసింది

    బాహుబలి 2 ఎంత వసూలు చేసింది

    తొలి 5 రోజుల గణాంకాలు పరిశీలిస్తే... తెలుగు బాక్సాఫీసు వద్ద బాహుబలి 2 చిత్రం రూ. 100 కోట్ల షేర్ రాబట్టింది. ఈ చిత్రం రైట్స్ రూ. 122 కోట్లకు అమ్ముడవ్వగా ఫుల్ రన్‌లో డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది.

    బాహుబలి 1

    బాహుబలి 1

    బాహుబలి-ది బిగినింగ్ తొలి 5 రోజుల్లో రూ. 52 కోట్ల షేర్ సాధించి వసూళ్లు అదరగొట్టింది. ఈ చిత్రం తెలుగు రైట్స్ అప్పట్లో రూ. 66 కోట్లకు అమ్మగా ఓవరాల్ రన్‌లో సూపర్ ప్రాఫిట్స్ నమోదు చేసింది.

     కబాలి వసూళ్లు

    కబాలి వసూళ్లు

    2.0 చిత్రం కంటే ముందు రజనీ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ‘కబాలి'. ఇది తెలుగులో తొలి 5 రోజుల్లో రూ. 20 కోట్ల షేర్ రాబట్టింది. అప్పట్లో ఈ మూవీ టాలీవుడ్ రైట్స్ రూ. 40 కోట్లకు అమ్మగా... డిస్ట్రిబ్యూటర్లను ఓవరాల్ రన్‌లో నష్టాలు లేకుండా బయటపడేసింది.

    English summary
    2.0 movie vs Baahubali 2 telugu 5 days collection report. Rajinikanth starrer 2.0 collected Rs. 36 cr share in Telugu states. Baahubali 2 collection is Rs. 100 cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X