»   » ఒక్క రోజులో మూడు రీళ్లు ఫినిష్ ...రజనీ మామూలోడు కాదు,షాక్

ఒక్క రోజులో మూడు రీళ్లు ఫినిష్ ...రజనీ మామూలోడు కాదు,షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా అక్షయ్‌కుమార్‌ విలన్‌గా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీక్వెల్‌ చిత్రం '2.ఓ'. ఈ చిత్రంకి రజనీకాంత్‌ డబ్బింగ్‌ చెప్పటం మొదలెట్టారు. అకాడమీ అవార్డు విజేత సౌండ్‌ ఇంజనీరు రసూల్‌ పోకుట్టి ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.

రజనీకాంత్‌ డబ్బింగ్‌ ప్రారంభించడం కోసం చెన్నై వెళ్తున్నానని తొలుత ట్వీట్‌ చేసిన ఆయన తర్వాతి ట్వీట్లలో రజనీని ప్రశంసలతో ముంచెత్తారు. పనిపట్ల తలైవాకున్న అంకితభావం సామాన్యమైనది కాదని, ఒక్కరోజులోనే మూడు రీళ్లు పూర్తి చేశారని, ఆయన పనితీరు చూసి ఆశ్చర్యపోయానని రసూల్‌ ట్వీట్‌ చేశారు.

పూర్తిగా విభిన్నమైనది

పూర్తిగా విభిన్నమైనది

‘2.0' సీక్వెల్‌ కాదని, ఇది పూర్తిగా విభిన్నమైన చిత్రమని రసూల్‌ అన్నారు. దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్‌కుమార్‌ విలన్ పాత్ర పోషించగా, అమీజాక్సన్‌ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్‌, జపనీస్‌, చైనీస్‌ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఆ ఇద్దరు నిర్మాతలు

ఆ ఇద్దరు నిర్మాతలు

మరో ప్రక్క ఈ సినిమాకు హైప్ రావటంతో సినిమాని తెలుగులో రిలీజ్ చేయాలని , దాన్ని కొనాలని తిరిగే తెలుగు నిర్మాతల రేసు మొదలైంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ రేసులో బెల్లంకొండ సురేష్, సాహసం శ్వాసగా సాగిపో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి లు పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ రైట్స్ ని చేజిక్కించుకోవాలని బేరసారాలను సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

టెక్నికల్ గా

టెక్నికల్ గా

2.ఓ చిత్రాన్ని 350 కోట్లతో రూపొందిస్తున్నారన్నది సమాచారం. దాంతో దానికి తగినట్లే తెలుగు రేటు కూడా ఉండనుంది. ఈ చిత్రాన్ని సాంకేతిక పరంగా హాలీవుడ్ చిత్రాల విలువలను మించే విధంగా తెరకెక్కిస్తున్నట్లు యూనిట్ వర్గాల టాక్. అమెరికాకు చెందిన సాంకేతిక నిపుణులు పలువురు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శంకర్ 3డీ ఫార్మెట్‌లో చిత్రీకరిస్తున్నారు.

విజువల్ ఎఫెక్ట్స్ ..

విజువల్ ఎఫెక్ట్స్ ..

ఈ చిత్రంలో రజనీ సరసన అమీ జాక్సన్ జంటగా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. మరో బాలీవుడ్ నటుడు సుధన్షు పాండే కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ‌ఆర్ రెహ్మాన్ స్వరకర్త. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఓ కొత్త అనుభూతినిస్తుందని చెప్తున్నారు.

రోబోలో హీరో రజనీకాదా..ఏంటి విషయం చూడండి

రోబోలో హీరో రజనీకాదా..ఏంటి విషయం చూడండి

‘రోబో'-2 లో నేను హీరోని కాదంటూ రజనీ సంచలనం, ఎవరెస్ట్ ని మోస్తున్నానంటూ శంకర్ షాకిస్తూ.. (ఫొటోలు)

రోబో హీరోయిన్..బికినీ వేస్తే ఎలా ఉంటుంది...

రోబో హీరోయిన్..బికినీ వేస్తే ఎలా ఉంటుంది...

అమీ జాక్సన్ బికినీలో.... షేప్స్ చూస్తే అంతే, కాచుకోండి!! (హాట్ ఫొటోలు)

English summary
Rajinikanth, who recently wrapped up the shooting of 2.0, has started dubbing for the film, which is the most anticipated Tamil film of 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu