రోబో మొత్తం వసూళ్లు ఒక్కరోజులో ఉఫ్.. చిట్టి 2.0 రికార్డుల వేట, తొలిరోజు అక్కడ ఎంతంటే!

Recommended Video

2.0 Hindi Version To Surpass The Lifetime Business Of Robot On The 1st Day Itself | Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. సినీ జనాల్లో ఎక్కడ చూసినా శంకర్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ గురించే చర్చ. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం మరే ఇండియన్ మూవీకి సాధ్యం కాని విధంగా 10 వేల స్క్రీన్స్ లో విడుదలవుతోంది. దీనితో ట్రేడ్ విశ్లేషకులు భారీ ఓపెనింగ్స్ నమోదవుతాయని అంచనావేస్తున్నారు. రజనీకాంత్ క్రేజ్ కు శంకర్ దర్శత్వం తోడైంది కాబట్టి వసూళ్లు ఊహకందని విధంగా ఉండబోతున్నాయి. తొలి రోజు నుంచే 2.0 రికార్డుల వేట మొదలుపెట్టనుంది.

అంతా భారీ స్థాయిలోనే

అంతా భారీ స్థాయిలోనే

దర్శకుడు శంకర్ 2.0 చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించారు. బడ్జెట్ పెరుగుతున్నా విజువల్స్ విషయంలో రాజీ పడలేదు. సుమారు 600 కోట్ల బడ్జెట్ ఈ చిత్రానికి ఖర్చు చేశారు. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 2.0 చిత్రానికి తొలి షో నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ట్రేడ్ వర్గాల్లో వసూళ్ల గురించి చర్చ మొదలైంది.

ఒక్కరోజులో ఉఫ్

ఒక్కరోజులో ఉఫ్

తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం 2.0 చిత్రాలు పలు రికార్డులని తొలిరోజే తుడిచిపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందీ బాక్సాఫీస్ విషయానికి వస్తే 2.0 చిత్రం చరిత్ర తిరగరాయబోతోందని అర్థం అవుతోంది. గతంలో శంకర్ తెరకెక్కించిన రోబో చిత్రం హిందీ వర్షన్ మాత్రమే 20 కోట్ల వసూళ్లు రాబట్టింది. హిందీ వర్షన్ ఫుల్ రన్ లో వచ్చిన వసూళ్లు ఇవి. ఇక ఈ రికార్డుని 2.0 చిత్రం తొలిరోజే తుడిచిపెట్టబోతోందట.

తొలిరోజు ఎంతంటే

తొలిరోజు ఎంతంటే

2.0 చిత్రం హిందీ వర్షన్ కేవలం తొలి రోజు మాత్రమే 25 కోట్లకు పైగా రాబట్టడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు తేల్చేశారు. ఇప్పటివరకు జరిగిన అడ్వాన్స్ బుకింక్, సినిమాకు వస్తున్న స్పందన చూసి ఈచిత్రం తొలి రోజు 25 కోట్లు రాబట్టడం చాలా సులువు అని పేర్కొంటున్నారు. ఈ చిత్రం గురించి కొందరు ట్రేడ్ విశ్లేషకులు మాట్లాడుతూ 2.0 చిత్ర వసూళ్లు బాహుబలి స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నాం. సినిమాకు హిట్ టాక్ వచ్చి మంచి రివ్యూ పడితే వసూళ్ల సంఖ్య ఇంకా భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

బడా నిర్మాత చేతుల మీదుగా

బడా నిర్మాత చేతుల మీదుగా

బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ 2.0 చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్నారు. బాహుబలిని కూడా హిందీలో రిలీజ్ చేసింది ఇతడే. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ చిత్రం విడుదలవుతోంది. ఇంత భారీ బడ్జెట్ లో త్రీడి ఫార్మాట్ లో రూపొందించిన తొలి ఇండియన్ మూవీ 2.0. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X