ఇది మెగా బ్లాక్‌బస్టర్ గురూ: 2.0 అఫీషియల్ కలెక్షన్స్ రూ. 400 కోట్లు (ఏరియా వైజ్)
రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2.0 చిత్రం బాక్సాఫీసును దున్నేస్తోంది. ఆదివారంతో తొలివారాంతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం గడిచిన నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్ల వసూలు చేసింది. ఇది కేవలం బ్లాక్ బస్టర్ కాదు.. మెగా బ్లాక్‌బస్టర్ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అఫీషియల్‌గా ప్రకటించింది.
ఫస్ట్ వీకెండ్ ఇంత భారీ మొత్తంలో గ్రాస్ సాధించడంతో రజనీకాంత్, అక్షయ్ కుమార్ అభిమానుల్లో మరింత జోష్ నిండినట్లయింది. సినిమాకు మౌత్ టాక్ కూడా సూపర్ పాజిటివ్‌గా ఉండటం, టెక్నికల్‌గా హాలీవుడ్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా కావడంతో ఇండియన్ ప్రేక్షకులు, ఇతర దేశాల్లో సెటిలైన భారతీయులు థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారు.

ఫస్ట్ వీకెండ్ తమిళనాడులో ఎంత?
రజనీకాంత్‌ను దేవుడుగా ఆరాధించే తమిళనాడులో 2.0 చిత్రానికి మొదటి వీకెండ్ కలెక్షన్ల పంట పండింది. నాలుగు రోజుల్లో తమిళనాడు వ్యాప్తంగా రూ. 53.2 కోట్ల వసూళ్లు సాధించింది. తొలిరోజు సినిమాకు ఎంత వసూలైందో... ఆదివారం కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ రావడం గమనార్హం.

ఏపీ-తెలంగాణల్లో వసూళ్ల వివరాలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా 2.0 చిత్రానికి రెస్పాన్స్ అదిరిపోయింది. మొదటి వీకెండ్ థియేటర్లన్నీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో కళకళలాడాయి. కొన్ని చోట్ల టికెట్లు దొరక్క ప్రేక్షకులు వెనక్కి వెళ్లిన పరిస్థితి కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 49.1 కోట్లు రాబట్టింది.

కర్నాటకలో ఎంత వసూలు చేసిందంటే..
కర్నాటకలో కూడా 2.0 చిత్రానికి వసూళ్ల పంట పండింది. తొలి 4 రోజుల్లో ఈ చిత్రం ఇక్కడ రూ. 20 కోట్లు వసూలు చేసింది. బెంగుళూరులో తమిళులు ఎక్కువగా ఉండటం కూడా సినిమాకు కలెక్షన్ల పరంగా కలిసొచ్చింది.

కేరళలో తక్కువే
అయితే కేరళలో 2.0 చిత్రానికి ఆదరణ కాస్త తక్కువగానే ఉంది. తొలి వీకెండ్ ఈ చిత్రం ఇక్కడ రూ. 10 కోట్లకు పై చిలుకు మాత్రమే వసూలు చేసింది.

ఇండియా వ్యాప్తంగా ఎంత?
సౌతిండియా వసూళ్లు మొత్తం రూ. 132.3 కోట్ల గ్రాస్ వసూలు చేయగా... ఉత్తరాదిలోనూ అదరొట్టింది. అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించడం హిందీ ప్రేక్షకులను సినిమా వైపు ఆకర్షిస్తోంది. నార్త్‌లో ఈ మూవీ రూ. 130 కోట్ల వరకు వసూలు చేసినట్లు అంచనా. దీంతో టోటల్ ఇండియా వైడ్ గ్రాస్ రూ. 262.3 కోట్లకు చేరుకుంది.

ఓవర్సీస్ మార్కెట్లో వసూళ్ల వివరాలు
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ఈ చిత్రం యూఎస్ఏలో రూ. 21 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో రూ. 4.87 కోట్లు, యూకెలో రూ. 3.77 కోట్లు, మలేషియాలో రూ. 2.86 కోట్లు, న్యూలాండ్లో రూ. 1 కోటి, సింగపూర్, జర్మీనీల్లో కలిపి రూ. 50 లక్షల వరకు వసూలు చేసినట్లు అంచనా. ఇంకా పలు ఏరియాలకు సంబంధించిన కలెక్షన్స్ వివరాలు రావాల్సి ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లు
2.0 మూవీ కలెక్షన్స్ వివరాలు అఫీషియల్‌గా వెల్లడిస్తూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ ట్వీట్ చేసింది. ఫస్ట్ వీకెండ్ రూ. 400 కోట్లు రాబట్టి ఈ మూవీ ఇది కేవలం బ్లాక్ బస్టర్ కాదు.. మెగా బ్లాక్‌బస్టర్ అని ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











