2 Years for Ala Vaikunthapurramuloo: అల్లు అర్జున్ వసూళ్ల సునామీ.. క్లోజింగ్ కలెక్షన్స్, ప్రాఫిట్స్ ఎంతంటే?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల.. వైకుంఠపురములో సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో మొదటి సారి రెండు వందల కోట్ల మార్కెట్ అందుకుంది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా వైపు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. ఇక ఆ సినిమా వచ్చి నేటికి రెండు సంవత్సరాలు గడిచింది. సినిమా కు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బాక్సాఫీస్ వద్ద మొత్తంగా ఏ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి అనే విషయంలోకి వెళితే..

హ్యాట్రిక్ సక్సెస్

హ్యాట్రిక్ సక్సెస్

జులాయి, S/o సత్యమూర్తి వంటి వరుస బాక్సాఫీస్ హిట్స్ అనంతరం అల్లు అర్జున్ - త్రివిక్రమ్ మరో మంచి కమర్షియల్ సినిమా చేయాలని చాలా రోజులు చర్చలు జరిపారు. అంతకుముందు వరకు కూడా బన్నీ వరుస పరాజయాలని చూసిన విషయం తెలిసిందే. ఇక ఎలాగైనా త్రివిక్రమ్ తో సక్సెస్ కొట్టాలని అల.. వైకుంఠపురములో అనే సినిమా చేశాడు. అనుకున్నట్లే హ్యాట్రిక్ విజయాన్ని చూశారు.

స్పెషల్ రోల్స్

స్పెషల్ రోల్స్

సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల.. వైకుంఠపురములో పోటీగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా కంటే ఎక్కువ స్థాయిలో వసూళ్లను అందుకుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా సీనియర్ నటీమణి టబు ఒక ముఖ్యమైన పాత్రలో దర్శనమిచ్చారు. ఇక హీరోగా సినిమాలు చేసిన సుశాంత్ మొదటి సారి ఈ సినిమాతో ఒక సపోర్టింగ్ రోల్ తో ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం అయ్యాడు.

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్

ఇక సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. నైజాంలో 43కోట్ల షేర్ రాబట్టిన అల.. వైకుంఠపురములో సీడెడ్ లో 19.3కోట్లను అందుకుంది. ఉత్తరాంధ్ర 20.9కోట్లు, గుంటూరులో 10.7కోట్లు, ఈస్ట్ లో 10.73కోట్లు, వెస్ట్ లో 8.7కోట్లు, కృష్ణ లో 9.5కోట్లు, నెల్లూరులో 4.25కోట్ల షేర్ ను రాబట్టింది. ఏపీ తెలంగాణలో టోటల్ గా 127.48కోట్ల షేర్ రాగా 210 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

మొత్తం క్లోజింగ్ కలెక్షన్స్

మొత్తం క్లోజింగ్ కలెక్షన్స్

అల.. వైకుంఠపురములో రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ 12.25కోట్లు రాగా ఓవర్సీస్ లో 19.45కోట్ల షేర్ దక్కింది. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ సినిమా మొదటిసారి 268.35కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. ఈ సినిమా సక్సెస్ తో అల్లు అర్జున్ చాలా ఎమోషనల్ అయ్యాడు. సంక్రాంతి సీజన్ లో కూడా అత్యధిక లాభాలను అందించిన సినిమాగా అల.. రికార్డు క్రియేట్ చేసింది.

ప్రాఫిట్స్ ఎంతంటే..

ప్రాఫిట్స్ ఎంతంటే..

అల.. వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ త్రివిక్రమ్ డైలాగ్స్ మేకింగ్ ఆఫ్ డ్రామా చాలా బాగా క్లిక్ అయ్యాయి. అంతే కాకుండా థమన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ప్రతీ పాట కూడా సినిమాకు ఎంతగానో ఉపయోగ పడింది. ఇక 85కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో మార్కెట్ లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 159 కోట్ల షేర్ ను అందుకొని అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాగా రికార్డును అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X