Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
ఎన్టీఆర్ 'బాద్షా' లాస్ అంతా?
హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'బాద్షా'. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ మొదటి వారం బాగున్నా..తర్వాత మెల్లిగా తగ్గిపోవటం మొదలైందనేది అందరికీ తెలిసిందే. ఈ నేఫధ్యంలో చిత్రం లాస్ ఎంత వచ్చిందనేది అంచనాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ చిత్రం లాస్ ఇరవై కోట్లు అని చెప్పుకుంటున్నారు. అయితే అది గిట్టని వారు చేస్తున్న ప్రచారంగా కొందరు కొట్టిపారేస్తున్నారు. తొలివారంలోనే చాలా వరకూ వెనక్కి వచ్చిందని అలాంటప్పుడు అంత లాస్ కి అవకాసమే లేదని చెప్తున్నారు.
అయితే బండ్ల గణేష్ ..ఐదు కోట్ల టేబుల్ లాస్ కి అమ్ముకున్నాడని, సినిమా హిట్టైతే షేర్ పద్దతిని రికవరి అయ్యేదని, యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలివారాంతానికే కలెక్షన్స్ క్షీణించటం దెబ్బకొట్టిందని,డిస్ట్రిబ్యూటర్స్ ఈ లాస్ ని తప్పనిసరిగా భరించాల్సిన సిట్యువేషన్ ఏర్పడిందని చెప్తున్నారు.
నిర్మాత బండ్ల గణేష్ ...తన ఇద్దరమ్మాయిలు చిత్రంతో డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్ రికవరీ చేస్తానని మాట ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మరో ప్రక్క ఈ లెక్కలు ఊహాత్మకమే అని ట్రేడ్ లో అంటున్నారు. ఖచ్చితంగా ఇంత పోయిందని అప్పుడే చెప్పలేమని, తెలిసినా అలాంటి విషయాలు నిర్మాతకు తప్ప ఖచ్చితంగా బయిటకు తెలియదని అంటున్నారు.
వీకెండ్స్ లో తప్ప మిగతా రోజుల్లో చెప్పుకోతగ్గ కలెక్షన్స్ లేవని అంటున్నారు. ఊహించిన విధంగా కామెడీ క్లిక్ కాకపోవటం ఈ సినిమాకు మైనస్ గా మారింది. అందులోనూ ఎన్టీఆర్ బాద్షా గెటప్ పేలలేదు. దాంతో సినిమా రేంజి తగ్గిపోయింది. పబ్లిసిటీ కూడా మొదటి ఓ రేంజిలో ఊపారు కానీ ఇప్పుడు పూర్తిగా తగ్గించేసారు.
దానికి తోడు నితిన్ తాజా చిత్రం గుండె జారి గల్లంతయ్యిందే కూడా ఈ చిత్రానికి పోటీగా మారింది. గుండె జారి గల్లంతయ్యిందే చిత్రం భాక్సాఫీస్ వద్ద మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకుంది. దాని ఎఫెక్టు బాద్షా పై బాగా పడుతోంది.